మమత బెనర్జీతో చంద్రబాబు భేటీ...ఎగ్జిట్ పోల్స్‌పైనే చర్చించారా..?

మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు.

news18-telugu
Updated: May 20, 2019, 7:39 PM IST
మమత బెనర్జీతో చంద్రబాబు భేటీ...ఎగ్జిట్ పోల్స్‌పైనే చర్చించారా..?
మమత బెనర్జీతో చంద్రబాబు నాయుడు
  • Share this:
కేంద్రంలో బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. 2014 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. నరేంద్ర మోదీయే మరోసారి ప్రధాన  మంత్రి అవుతారని తెగేసి చెప్పాయి. ఈ క్రమంలో బీజేపీయేతర పక్షాల్లో గుబులు మొదలయిట్లే కనిపిస్తోంది. ఎన్నిలకల ఫలితాల  ఏం చేయాలన్న దానిపై వ్యూహాలు రచిస్తున్నారు విపక్ష నేతలు. ఇప్పటికే ఢిల్లీలో పలు పార్టీల అధినేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు.. తాజా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కోల్‌కతాలో కలిశారు.  ఎన్నిలక తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంట పాటు చర్చలు జరిపారు.

ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మబోమని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. మమతా బెనర్జీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్‌ని చేరుకోదని...ఎన్డీయేతర పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.  కూటమి ఏర్పాటు బాధ్యతలను తీసుకున్న చంద్రబాబు ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ తంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి చర్చించారు. ఆ క్రమంలోనే ఇవాళ మమతా బెనర్జీని కలిసి సమాలోచనలు చేశారు.

కోల్‌కతా నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు. సోనియా గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈవీఎంలకు వ్యతిరేక విపక్షాల పోరాటం కొనసాగుతోంది.  మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5  వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు.  ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు