నిన్న ఈటల.. ఇప్పుడు రసమయి.. బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు..

రసమయి బాలకిషన్

రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న ఈటల నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. ‘ఏమీ కాదన్నా’ అనుకుంటూనే రసమయి బాలకిషన్ తన సహజశైలిలో ప్రసంగం కొనసాగించారు.

  • Share this:
    కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పలు వార్తలు షికార్లు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చునంటూ మాట్లాడారు బాలకిషన్. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న ఈటల నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. ‘ఏమీ కాదన్నా’ అనుకుంటూనే రసమయి బాలకిషన్ తన సహజశైలిలో ప్రసంగం కొనసాగించారు. ఆ తర్వాత మాట్లాడిన ఈటల.. రసమయికి కాస్త స్వేచ్ఛ ఎక్కువ అని... అయితే రసమయి మాటలతో తాను ఏకీభవిస్తానంటూ మళ్ళీ ఈటల చెప్పుకు రావడంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి మాటలు సంచలనంగా మారాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: