నిన్న చిరంజీవి, ఇవాళ మహేష్.. రేపు ఎవరు? టాలీవుడ్లో చర్చ
చిరంజీవి, మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ నుంచి జగన్‌ను కలిసేది ఎవరనే చర్చ సినీ ఇండస్ట్రీలో మొదలైంది.
news18-telugu
Updated: October 25, 2019, 3:44 PM IST

చిరంజీవి, మహేష్ బాబు
- News18 Telugu
- Last Updated: October 25, 2019, 3:44 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ఒక వాదన బలంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదంటూ వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృధ్వీ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి ‘పెద్దలు, పెద్ద హీరోలు’ అనే వారు ఎవరూ జగన్‌ను కలవలేదు. దీంతో ఈ వాదన వినిపించింది. అయితే, తాజాగా సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి సతీసమేతంగా వెళ్లి అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి దంపతులను కలిశారు.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అమరావతి వెళ్లి సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లాలోని మహేష్ బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అభివృద్ది పనుల గురించి భారతితో నమత్ర చర్చించారు. భవిష్యత్‌లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నమ్రత కలవడం అంటే మహేష్ బాబు వెళ్లినట్టుగానే భావించాలి.
చిరంజీవి, మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ నుంచి జగన్‌ను కలిసేది ఎవరనే చర్చ సినీ ఇండస్ట్రీలో మొదలైంది. ఇకపై వరుసగా టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు జగన్‌ను కలవడానికి ఉత్సాహం చూపించనున్నారు. ఈ క్రమంలోనే ఆగిపోయిన నంది అవార్డుల పురస్కారాలను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించాలని కోరే అవకాశం ఉంది.
ధన్తేరస్ ఎందుకొచ్చింది.. బొమ్మల కథ..

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ

వైఎస్ భారతి,నమత్ర శిరోద్కర్
పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం... ఎవరికంటే...
టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ...
దిశ హంతకుల ఎన్కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..

Loading...