మేకలు దొంగతనం చేసిన ఎంపీ.. గేదెలు, పుస్తకాలు కూడా..
అజంఖాన్, ఆయన అనుచరులు వచ్చి తమను ఖాళీ చేయాలంటూ బెదిరించడమే కాకుండా, తమ మేకలు, గేదెలు, బంగారం ఎత్తుకెళ్లారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
news18-telugu
Updated: September 13, 2019, 7:30 PM IST

ఆజం ఖాన్ (File)
- News18 Telugu
- Last Updated: September 13, 2019, 7:30 PM IST
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ నేత, రాంపూర్ ఎంపీ అజంఖాన్ మీద విచిత్రమైన కేసు నమోదైంది. ఆయన మేకలు, గేదెలను ఎత్తుకెళ్లారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల రోజుల వ్యవధిలో అజంఖాన్ మీద సుమారు 80 కేసులు నమోదయ్యాయి. ఈ మేకల దొంగతనం కేసు 82వది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో 2006లో అజంఖాన్ ఓ యూనివర్సిటీని నిర్మించారు. మొహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ పేరుతో నిర్మించిన ఈ వర్సిటీ గేటు ప్రభుత్వ స్థలంలో ఉందని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు 20 ఏళ్లుగా వక్ఫ్ బోర్డు భూములను తాము కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటుంటే.. వాటిని ఖాళీ చేయించాలని బెదిరించారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజంఖాన్, ఆయన అనుచరులు వచ్చి తమను ఖాళీ చేయాలంటూ బెదిరించడమే కాకుండా, తమ మేకలు, గేదెలు, బంగారం ఎత్తుకెళ్లారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఎంపీ మీద మేకల దొంగతనం కేసు నమోదు చేశారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ ఎంపీని కావాలనే టార్గెట్ చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అజంఖాన్‌కు మద్దతు పలికేందుకు ఆయన రాంపూర్ వెళ్లారు.
Loading...