AFTER BHARAT BANDH TELANGANA CM KCR PLANS FOR ANTI BJP RALLY IN DELHI IN SUPPORT OF PROTESTING FARMERS BA
Bharat Bandh: బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మరో ప్లాన్.. భారత్ బంద్ తర్వాత అమల్లోకి
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు, తెలంగాణలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా రైతు చట్టాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్ పార్టీ, తాజాగా దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు పలికింది. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రోడ్లపై ధర్నాకు దిగారు. కేంద్రం తెచ్చిన చట్టాలను రద్దు చేయాలంటూ రైతులకు సంఘీభావం పలుకుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల వద్ద మంత్రి కేటీఆర్ రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు. కేంద్రం వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం అని, వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందన్నారు. నూతన చట్టంలో మద్దతు ధర అనే అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమని కేటీఆర్ అన్నారు. మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి... రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక అలంపూర్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ వద్ద మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హన్మకొండ-వరంగల్ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో జరిగిన ధర్నాలో పాల్గొన్న కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో 92.5 శాతం మంది ఐదు ఎకరాల లోపు రైతులు ఉన్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. వాళ్ల కు వేరే ప్రాంతకు వెళ్లి అమ్ముకోవడం సాధ్యం కాదని తెలిపారు. కొత్త చట్టం అమలులోకి వస్తే కార్పొరేట్ సంస్థలు చేతికి వెళ్తుందని, రైతులకు మద్దతు ధర లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ షాద్ నగర్లో రైతుల నిరసన
ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు, తెలంగాణలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. భారత్ బంద్‌లో పాల్గొనడంతో పాటు ఢిల్లీలో కూడా మరో ధర్నా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో హైదరాబాద్‌లో మహా సభ నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించారు. తాజాగా, మరో అడుగు ముందుకేసి ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఢిల్లీలోనే తెలంగాణ ప్రభుత్వం నిరసన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై త్వరలో టీఆర్ఎస్ పార్టీ పరంగా ఓ అధికారిక ప్రకటన రానుంది.
డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య మరోదఫా చర్చలు జరగనున్నాయి. ఆ చర్చల సారాంశాన్ని బట్టి కేసీఆర్ అడుగులు వేయనున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ఓకే. లేకపోతే ఢిల్లీ వేదికగా హస్తినలోనే మరింత దృఢమైన ఉద్యమాన్ని కేసీఆర్ చేయాలని నిర్ణయించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.