news18-telugu
Updated: May 30, 2020, 3:40 PM IST
నాగబాబు (Twitter/Nagababu)
తెలుగుదేశం పార్టీపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు పంచ్ వేశారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ మీద సెటైర్లు వేశారు. వైసీపీ తర్వాత జనసేన వస్తుందా?, బీజేపీ వస్తుందా? తెలీదు కాని, టీడీపీ మాత్రం కచ్చితంగా రాదని చెప్పారు. ఎందుకంటే టీడీపీ చేసిన అభివృద్ది అంతా అనుకూల మీడియాలోనే ఉందని, గ్రౌండ్లోలేదని మండిపడ్డారు. ‘AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా, jsp వస్తుందా, బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి. ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ap ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు. development అంతా ఆనుకుల టీవీల్లోను, పత్రికల్లోనే కనబడేది. గ్రౌండ్ లో కనిపించింది తక్కువ. ప్లస్ corruption, sand mafia, call money అబ్బో ఇంకా చాలావున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి illusions లోంచి బయటకి రావాలి. లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే they అర్ welcome. కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని hallusinations అంటారు. అల్ ద బెస్ట్ ఫర్your hallusinations.’ అని నాగబాబు ట్వీట్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 30, 2020, 3:40 PM IST