Huzurnagar By-Election : టీఆర్ఎస్‌‌కు సీపీఐ షాక్.. మద్దతు ఉపసంహరణ..

Huzurnagar By-Election 2019 : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తుండటంతో మరో పార్టీతో పొత్తు కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీపీఐ మద్దతు కోరింది.

news18-telugu
Updated: October 12, 2019, 7:31 AM IST
Huzurnagar By-Election : టీఆర్ఎస్‌‌కు సీపీఐ షాక్.. మద్దతు ఉపసంహరణ..
సీఎం కేసీఆర్ (File Photo)
news18-telugu
Updated: October 12, 2019, 7:31 AM IST
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కామ్రేడ్లను కలుపుకుపోవాలన్న టీఆర్ఎస్ ఆలోచన బెడిసికొట్టింది. ఉపఎన్నిక సమయంలోనే ఆర్టీసీ సమ్మె తెర పైకి రావడంతో సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వ్యక్తమైంది.దీంతో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకోక తప్పలేదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఏడో రోజు కార్మికుల సమ్మెలో పాల్గొన్న చాడ.. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ఇది రాచరికం కాదని.. ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపాలని.. వారి తరుపున చర్చలకు తాము సిద్దమని తెలిపారు.ఆర్టీసీని అప్పులపాలు చేసింది ప్రభుత్వమేనని ఆరోపించారు. కార్మికుల సమస్యకు సీపీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని..
సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తుండటంతో మరో పార్టీతో పొత్తు కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీపీఐ మద్దతు కోరింది. హుజూర్ నగర్ పారిశ్రామిక ప్రాంతం కావడం.. సీపీఐకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉండటంతో ఆ పార్టీని కలుపుకు వెళ్లడం కలిసొస్తుందని భావించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ నేత కేకే నేత్రుత్వంలోని బృందం సీపీఐతో చర్చలు జరిపి పొత్తు ఖరారు చేసింది. కానీ ఇంతలోనే ఆర్టీసీ సమ్మె తెరపైకి రావడం.. అటు ప్రభుత్వం,ఇటు కార్మికులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సీపీఐ పునరాలోచనలో పడింది. కార్మికవర్గాల్లో పట్టున్న సీపీఐ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు మద్దతునిస్తే.. కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని భావించింది. ఈ నేపథ్యంలోనే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...