• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ADVOCATES PROTEST AGAINST CHANDRA BABU ROAD SHOW IN KARNOOL GNT NGS

Andhra Pradesh: కర్నూలులో చంద్రబాబుకు చేదు అనుభవం.. అడ్డుకున్న న్యాయవాదులు

Andhra Pradesh: కర్నూలులో  చంద్రబాబుకు చేదు అనుభవం.. అడ్డుకున్న న్యాయవాదులు

చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న న్యాయవాదులు

కర్నూలులో న్యాయవాదులు చంద్రబాబును అడ్డుకున్నారు. కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలిపిన తరువాతే ముందుకు వెళ్లాలి అంటూ డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి.

  • Share this:
    మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాలనుకున్న చంద్రబాబుకు తొలిరోజే చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నిల ప్రచారంలో భాగంగా  కర్నూలు జిల్లాలో పర్యటించారు. పెద్ద మార్కెట్ దగ్గర.. టీడీపీ అభ్యర్థుల తరుపున చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఆ రోడ్ షోకు భారీగా వచ్చిన న్యాయవాదులు చంద్రబా మీటింగ్ కు అడ్డుపడ్డారు.

    హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలిపిన తరువాత ఆయన ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టుకు ఆమోదం తెలపకుండా ప్రచారం నిర్వహిస్తే ముందుకు కదలనివ్వం అంటూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పెద్దమార్కెట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

    న్యాయవాదులను అక్కడి నుంచి పోలీసులు పంపించివేసిన తరువాత చంద్రబాబు రోడ్ షో కొనసాగింది. పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకున్న తరువాత.. గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షో సాగింది. చెన్నమ్మసర్కిల్‌ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలతో మాట్లాడారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చంద్రబాబు వివరించారు.

    కర్నూలులో ప్రచారంలో సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోపూర్తిగా మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన అని, బీ అంటే బాదుడని.. సీ అవినీతి అని, డీ అంటే విధ్వంసంమని కొత్త అర్థం చేప్పారు.

    అయితే చంద్రబాబు కర్నూలు పర్యటనే ఇలా ఉంటే.. రెండో రోజు చంద్రబాబు విశాఖకు వెళ్తున్నారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీంతో చంద్రాబాడు రోడ్ షోలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలే ఓటమి భయంతో ఇలా చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు