అద్వాని తిట్టింది మోదీనే... ప్రధానిపై మరోసారి చంద్రబాబు విమర్శలు

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు. టీడీపీపై కేంద్ర వ్యవస్థలతో ఇష్టానుసారంగా దాడులు చేయిస్తున్నారన్నారు.

news18-telugu
Updated: April 5, 2019, 11:20 AM IST
అద్వాని తిట్టింది మోదీనే... ప్రధానిపై మరోసారి చంద్రబాబు విమర్శలు
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ వ్యవస్థాపక నేత ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన స్వార్థం కోసం మోదీ... పార్టీని, దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని మోదీలాంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఉందన్నారు. ఆయనవల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు చంద్రబాబు. తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అదే విషయాన్ని ఇప్పుడు అద్వాని సున్నితంగా చెప్పారని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు టెలికాన్ఫరెన్స్‌లో కూడా మోదీపై మండిపడ్డారు సీఎం. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు. టీడీపీపై కేంద్ర వ్యవస్థలతో ఇష్టానుసారంగా దాడులు చేయిస్తున్నారన్నారు.

ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ తన సందేశాన్ని పంపించారు. అందులో ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘బీజేపీని వ్యతిరేకించే వారు దేశద్రోహులుగా భావించే సంస్కృతి పార్టీకి లేదు’ అని అద్వానీ పేర్కొన్నారు. అలాగే, రాజకీయంగా వ్యతిరేకించే వారు శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ‘భిన్నత్వాన్ని, వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించడమే భారతీయ ప్రజాస్వామ్యానికి మూలం’ అని అన్నారు. భారతదేశ స్వతంత్రతను, సమగ్రతను, వ్యవస్థలను, మీడియాను కాపాడడం బీజేపీ బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు అద్వాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 
Loading...First published: April 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading