అద్వానీకి టికెట్ దక్కకపోవడానికి వయసొక్కటే కారణం కాదు.. నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

తాను ప్రధాని పదవి రేస్‌లో లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం, మోదీ పీఎం కావడం ఖాయమని తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: April 5, 2019, 6:07 PM IST
అద్వానీకి టికెట్ దక్కకపోవడానికి వయసొక్కటే కారణం కాదు.. నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ కురువృద్ధులకు టికెట్లు దక్కకపోవడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించినట్టు ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే, వయసు ఒక్కటే కారణం కాదని, ఇతరత్రా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని గడ్కరీ తెలిపారు. సీఎన్‌బీసీ - టీవీ18 రిపోర్టర్ అర్చన శుక్లాకు నితిన్ గడ్కరీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అద్వానీ, మురళీ మనోహర్ జోషి మా ఐకాన్లు. వారి మీద మాకు పూర్తి గౌరవం ఉంది. రాజకీయాల్లో ఒక తరం నుంచి మరో తరం వస్తుండాలి. ‘పెద్ద వాళ్లు’ అన్న కారణంతోనే వారికి టికెట్ నిరాకరించలేదు.’ అని తెలిపారు. తాను ప్రధాని పదవి రేస్‌లో లేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం, మోదీ పీఎం కావడం ఖాయమని తేల్చి చెప్పారు.

Amit shah, lk advani, Gandhi nagar, Prakash javdekar, bjp, Gujarat, narendra modi, అమిత్ షా, ఎల్‌కే అద్వానీ, గాంధీనగర్, ప్రకాష్ జవదేకర్, బీజేపీ, గుజరాత్, నరేంద్రమోదీ
అద్వానీతో అమిత్ షా(ఫైల్ ఫోటో)


దేశంలో నిరుద్యోగం, వ్యవసాయం సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగం అనేది కేవలం మోదీ ప్రభుత్వంలోనే ఉన్న సమస్య కాదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లలోనే నిరుద్యోగాన్ని అంతం చేస్తామని తామేమీ చెప్పలేదన్నారు. బయోఇథనాల్ వినియోగంపై ప్రోత్సహించడం ద్వారా రూ.2లక్షల కోట్ల ఇండస్ట్రీ ఏర్పడిందని, 50లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. రోడ్స్ సెక్టార్‌లో 35వేల మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు.

narendra modi,chandra babu,jagan,kcr,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,నరేంద్ర మోదీ,చంద్రబాబు,జగన్,వైఎస్ జగన్,కేసీఆర్,రాహుల్ గాంధీ,
నరేంద్ర మోదీ


దేశభద్రత విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఎయిర్‌స్ట్రైక్స్ వంటి వాటిపై రాజకీయాలు తగవన్నారు. అసలు దేశ భద్రత అనే అంశంపై చర్చకు పెట్టడం సరికాదని గడ్కరీ అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై తీర్మానం కూడా చేశామని గడ్కరీ చెప్పారు.
First published: April 5, 2019, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading