Home /News /politics /

ADR REPORT SAYS BJP RICHEST PARTY IN 2019 20 FOLLOWED BY BSP PVN

ADR Report : ఆస్తుల్లో బీజేపీనే బాద్ షా..ప్రాంతీయ పార్టీల్లో అవే రిచ్చెస్ట్

బీజేపీ(ప్రతీకాత్మక చిత్రం)

బీజేపీ(ప్రతీకాత్మక చిత్రం)

POLITICAL PARTIES Assets : బ్యాంకులలోని ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆస్తులు, రుణాల రూపంలో తీసుకున్న నగదు, టీడీఎస్‌, టీఏసీఎస్‌లు కలుపుకొని లెక్కించగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 6,988.57 కోట్లు. 44 ప్రాంతీయ పార్టీలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 2,129.38 కోట్లు.

ఇంకా చదవండి ...
Political Parties Assests :  మరికొద్ది రోజుల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శుక్రవారం జనతా పార్టీ (బీజేపీ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తన ఆస్తులను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,847.78 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే బీజేపీ ఆస్తులు...దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే అత్యధికం అని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ADR)రిపోర్ట్ తెలిపింది.

"2019-20 ఆర్థిక సంవత్సరానికి జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆస్తులు, అప్పుల విశ్లేషణ" అనే టైటిల్ తో ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకులలోని ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆస్తులు, రుణాల రూపంలో తీసుకున్న నగదు, టీడీఎస్‌, టీఏసీఎస్‌లు కలుపుకొని లెక్కించగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 6,988.57 కోట్లు. 44 ప్రాంతీయ పార్టీలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 2,129.38 కోట్లు. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కించగా రూ.9,117.95 కోట్లు ఉంది. 7 జాతీయ, 44 ప్రాంతీయ పార్టీలకు మొత్తం అప్పులు 134 కోట్లు రూపాయల అప్పులు ఉన్నాయి. ఇందులో 74 కోట్లు రూపాయలు జాతీయ పార్టీలవి కాగా,మిగిలినవి ప్రాంతీయ పార్టీలవి.

ALSO READ Viral Video: వామ్మో! వట్టి చేతులతో భారీ కింగ్ కోబ్రాను వంచేశాడు.. దయచేసి మీరిలా చేయొద్దు..

ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం..పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో...ఒక్క బీజేపీ ఆస్తులే రూ.4,847.78 కోట్లు. అంటే జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు కలిపి మొత్తం 51 పార్టీల ఆస్తుల్లో బీజేపీ వాటా 53శాతంగా ఉందని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. 2019-20 గణాంకాల ప్రకారం మరే పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లో లేదు. బీజేపీ వద్ద ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలోనే రూ.3,253 కోట్లు ఉన్నాయి. ఆస్తులపరంగా దేశంలో ద్వితీయస్థానంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(BSP)నిలిచింది. బీఎస్పీ రూ.698.33 కోట్ల(9.99శాతం)ఆస్తులను కలిగి ఉంది. బీఎస్పీకి అప్పు మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. బీఎస్పీ వద్ద ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో రూ.618.86కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.588.16 కోట్ల(8.42శాతం)ఆస్తులతో మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ వద్ద ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో రూ.240.90 కోట్లు ఉన్నాయి. ఆస్తుల్లో మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అప్పుల్లో మొదటిస్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) రూ. 11.32 కోట్లు (15.24 శాతం) అప్పులతో రెండో స్థానంలో నిలిచింది. ఇక,జాతీయ పార్టీల్లో అతి తక్కువగా రూ.8.20 కోట్ల ఆస్తులతో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఏడోస్థానంలో నిలిచింది.

ఇక,ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే....44 ప్రాంతీయ పార్టీలకు ఉన్న ఆస్తుల్లో 95.27 శాతం 10 ప్రాంతీయ పార్టీల దగ్గరే ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. ఈ పది పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్,టీడీపీ,వైసీపీ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో రూ. 563.47 కోట్ల(26.46శాతం) ఆస్తులతో సమాజ్‌వాదీ పార్టీ(SP) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)కి రూ. 301.47 కోట్ల రూపాయలుండగా, అన్నాడీఎంకే పార్టీ రూ. 261 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించింది. పార్టీల ఆస్తుల్లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలోనే ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వివరించింది. ఇక, ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి(TDP) రూ.30.342 కోట్ల అప్పులు ఉన్నాయి. టీఆర్ఎస్ కు  రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా.. వైసీపpolitical parties అప్పులను నివేదికలో పొందుపర్చలేదు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మార్గదర్శకాలను పాటించడంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయని ఏడీఆర్‌ విశ్లేషణలో వెల్లడైంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు