వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే... రాజీనామాకు రెడీ ?

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: September 3, 2019, 12:59 PM IST
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే... రాజీనామాకు రెడీ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రకమైన చేరికలపై ముందుగానే కండిషన్ పెట్టారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ పార్టీలోకి రావాలనుకునే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలెవరైనా... ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలని వైసీపీ షరతు విధించింది. ఈ కారణంగానే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలెవరూ వైసీపీకి రావడానికి వెనకడుగు వేస్తున్నారనే వాదన ఉంది. అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సిద్ధమవుతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్‌కు టీడీపీలోని కరణం బలరాం కుటుంబానికి అస్సలు పొసగడం లేదు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినా... సమస్య పరిష్కారం కాలేదని సమాచారం. దీంతో టీడీపీలో ఉంటూ కరణం ఫ్యామిలీతో గొడవ పడటం ఇష్టంలేకే గొట్టిపాటి రవికుమార్ మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంగానే ఆయన చాలాకాలం నుంచి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ వైసీపీ తరపున పోటీ చేసి గెలుస్తానని నమ్మకం అద్దంకి ఎమ్మెల్యేలో బలంగా ఉందని... ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే సీఎం జగన్‌కు చెప్పారని టాక్. దీనిపై సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>