వైసీపీకి షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే... ఏమన్నారంటే...

గొట్టిపాటితో ఇప్పటికే పలువురు మంత్రులు సమావేశమయ్యారని... త్వరలోనే ఆయన వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వినిపించాయి.

news18-telugu
Updated: December 9, 2019, 12:13 PM IST
వైసీపీకి షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే... ఏమన్నారంటే...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ ఇప్పటికే సొంత పార్టీపై విమర్శలు గుప్పించి... ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. వంశీ తరువాత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. గొట్టిపాటితో ఇప్పటికే పలువురు మంత్రులు సమావేశమయ్యారని... త్వరలోనే ఆయన వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని ఎమ్మెల్యే రవికుమార్ స్పష్టం చేశారు.

తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగదలచుకున్నానని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన గొట్టిపాటి రవికుమార్... మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తమ కుటుంబం దశాబ్దాల కాలం నుంచి మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తుందని... గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. తనిఖీలపైన కనీసం సమాచారం కూడా అధికారులు ఇవ్వడం లేదరి అన్నారు. క్వారీల్లోకి తమ సిబ్బంది అనుమతించడం లేదని వ్యాఖ్యానించారు. వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని గొట్టిపాటి రవికుమార్ వివరించారు.


First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>