• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ADALA PRABHAKAR REDDY QUITS TDP JOINED YSRCP LIKELY TO CONTEST FROM NELLORE PARLIAMENT BA

మొన్న టీడీపీ టికెట్ ఖరారు.. ఇవాళ వైసీపీ కండువా వేసుకున్న నేత

మొన్న టీడీపీ టికెట్ ఖరారు.. ఇవాళ వైసీపీ కండువా వేసుకున్న నేత

వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి

చంద్రబాబునాయుడు ప్రకటించిన 126 మంది ఎమ్మెల్యేల జాబితాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆదాల ఇప్పుడు వైసీపీలో చేరారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీలో టికెట్ ఖరారు అయిన తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు నెల్లూరు జిల్లా నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన 126 మంది ఎమ్మెల్యేల జాబితాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఇది జరిగిన మూడు రోజులకే ఆయన వైసీపీలో చేరిపోయారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి కండువా కప్పి జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. నెల్లూరులో సిట్టింగ్ ఎంపీ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: