షాకింగ్... నిన్న టీడీపీ టికెట్లు ఖరారు.. నేడు వైసీపీలోకి వెళ్లాలని ఇద్దరు నేతల నిర్ణయం

నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ టికెట్ కన్ ‌ఫామ్ చేసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి... ఉన్నట్టుండి అజాతంలోకి వెళ్లడం కలకలం సృష్టించింది. నెల్లూరులోని ఆయన కార్యాలయం దగ్గర ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడంతో... ఆయన వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: March 15, 2019, 3:20 PM IST
షాకింగ్... నిన్న టీడీపీ టికెట్లు ఖరారు.. నేడు వైసీపీలోకి వెళ్లాలని ఇద్దరు నేతల నిర్ణయం
చంద్రబాబు, జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టికెట్ ఆశించే నేతలు పార్టీ మారడం సహజం. అయితే ఏపీలోని టికెట్ టికెట్ ఖాయం చేసుకున్న ఓ టీడీపీ నేత... వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే న్యూస్ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ టికెట్ కన్ ‌ఫామ్ చేసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి... ఉన్నట్టుండి అజాతంలోకి వెళ్లడం కలకలం సృష్టించింది. దీనికి తోడు నెల్లూరులోని ఆయన కార్యాలయం దగ్గర ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడంతో... ఆయన వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

వైసీపీలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖాయం చేశారని... ఈ కారణంగానే ఆయన టీడీపీ టికెట్ దక్కిన తరువాత కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఏరికోరి నెల్లూరు రూరల్ టికెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి... మరీ అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ తరపున నెల్లూరు రూరల్ టికెట్ ఖాయం చేసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వెళితే... అధికార పార్టీకి అంతకంటే పెద్ద షాక్ మరొకటి ఉండదనే చెప్పాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ సీటు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైనట్టు సమాచారం. అక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు అదే స్థానంలో టికెట్‌ను కూడా టీడీపీ ఖరారు చేసింది. అయితే, తోట త్రిమూర్తులు కూడా వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయనకు కాపు కోటాలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. తోట త్రిమూర్తులు ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం టీడీపీకి షాకింగ్‌గా ఉంది.
First published: March 15, 2019, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading