కమల్‌హాసన్‌ పార్టీకే నా ఓటు అంటున్న శృంగారతార

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ప్రముఖ సినీతారలు కొత్త పార్టీలతో ఎన్నికల క్షేత్రంలో దిగుతుండడంతో మరింత రంజుగా మారుతున్నాయి. ఆయా పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి.

news18-telugu
Updated: January 14, 2019, 7:19 PM IST
కమల్‌హాసన్‌ పార్టీకే నా ఓటు అంటున్న శృంగారతార
కమల్ హాసన్ (ఫైల్ ఫొటో)
  • Share this:
తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళుల అమ్మ జయలలిత మరణంతో మారిన రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకునే పనిలో ఉన్న వెండితెర నాయకులు. ముఖ్యంగా సూపర్ స్టార్స్ కమల్‌హాసన్, రజనీకాంత్ ఆ లిస్టులో ముందున్నారు. వీరిద్దరిలో కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ మాత్రం.. ఓవైపు సినిమాలు చేస్తూనే పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు.

kamal Hassan, kamal Hassan party, shakila, కమల్ హాసన్, కమల్ హాసన్ పార్టీ, షకీల ఫోటోలు, షకీల చిత్రాలు
షకీల ఫైల్ ఫోటో


ఈ నేపథ్యంలో కమల్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. అటు రాజకీయాల్లోని ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరుతుండగా.. ఇటు సినీరంగానికి చెందినవారు కూడా కమల్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, సీనియర్ నటి, శృంగార తార షకీలా సైతం కమల్ పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. కమల్‌హాసన్ సినిమాలను తొలిరోజునే ఎగబడి చూసేదాన్నని.. ఇప్పుడు తన అభిమాన నటుడు రాజకీయాల్లో రావడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అవకాశం వస్తే ఆయన పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను సినిమాల్లోకి వచ్చేలా చేశాయని నటి షకీలా చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు తనపై శృంగారతారగా ముద్ర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయాల్లో కమల్‌కు మద్దతు తెలుపుతున్నానని, అవకాశం వస్తే ఆయన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
First published: January 14, 2019, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading