ఎన్నికల టైమ్‌లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ప్రణీత

కర్ణాటక రాష్ట్ర ఐకాన్‌గా ప్రణీతను ఎంపిక చేస్తూ ఎలక్షన్ కమిషన్ అందజేసిన లేఖను ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: April 10, 2019, 3:11 PM IST
ఎన్నికల టైమ్‌లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ప్రణీత
ప్రణీత సుభాష్
  • Share this:
హీరోయిన్ ప్రణీత సుభాష్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రణీత స్వయంగా ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర ఐకాన్‌గా ప్రణీతను ఎంపిక చేస్తూ ఎలక్షన్ కమిషన్ అందజేసిన లేఖను ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలపై అవగాహన కల్పించడానికి ప్రణీత కృషి చేయనుంది. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేయనుంది. కర్ణాటకలో 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోకిరి కన్నడ రీమేక్‌తో ప్రణీత్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా యాక్ట్ చేసింది. 

View this post on Instagram
 

‪Honoured to be nominated as a State Icon by the Election Commission to promote Voter Awareness for the General Elections to Lok Sabha 2019. ‬


A post shared by Pranitha (@pranitha.insta) on
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు