మోదీ సర్కారు నిర్ణయానికి సమర్థన..కుష్బూ బీజేపీలో చేరనున్నారా?

కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని కుష్బూ సమర్థించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మరింది. కుష్బూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారని, దీనికి ఈ కామెంట్స్ సంకేతమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: July 30, 2020, 6:21 PM IST
మోదీ సర్కారు నిర్ణయానికి సమర్థన..కుష్బూ బీజేపీలో చేరనున్నారా?
ఖుష్బూ సుందర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రముఖ సిని నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సమర్థించారు. ఈ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.కొత్త విద్యా విధానంలోని పలు అంశాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా విద్యా విధానంలో మోదీ సర్కారు మార్పులు తెస్తోందని ఆ పార్టీ నేతలు పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కొత్త విద్యా విధానాన్ని సమర్థిస్తూ కుష్బూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో కుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో డీఎంకే నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అటు బీజేపీ మద్ధతుదారులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు పార్టీలోకి స్వాగతం పలికారు.kushboo age, kushboo daughters, kushboo movies, kushboo photos, kushboo party, kushboo news, కుష్బూ వార్తలు, కుష్బూ వయస్సు, కుష్బూ కుమార్తెలు, కుష్బూ భర్త, కుష్బూ ఫోటోలు
కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ


ఈ నేపథ్యంలో తన వైఖరిపై మరింత క్లారిటీ ఇస్తూ కుష్బూ మరో ట్వీట్ చేశారు. జాతీయ కొత్త విద్యా విధానం విషయంలో తన వైఖరి, పార్టీ వైఖరికి భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. దీని పట్ల తాను పార్టీ నేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే తాను రోబోలా పనిచేయలేనని, తన మనసుకు కరెక్టని భావిస్తే అదే చెబుతానని వ్యాఖ్యానించారు. నాయకుడి చెప్పేది ప్రతి ఒక్కటీ సమర్థించే పద్ధతి కాకుండా...ఓ పౌరురాలిగా తన అభిప్రాయాన్ని చెప్పే ధైర్యం ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నందునే...తాను ఇలా మాట్లాడగలుగుతున్నట్లు పేర్కొన్నారు.
kushboo age, kushboo daughters, kushboo movies, kushboo photos, kushboo party, kushboo news, కుష్బూ వార్తలు, కుష్బూ వయస్సు, కుష్బూ కుమార్తెలు, కుష్బూ భర్త, కుష్బూ ఫోటోలు
సినీ నటి ఖుష్బు (ఫైల్ ఫోటో )


అంత మాత్రం చేత తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతానన్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. తనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ కొందరు చేసిన ట్వీట్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సంఘ్ పరివార్ భక్తులు ఈ ప్రపంచంలో అత్యంత గందరగోళ జీవులుగా ఎద్దేవా చేశారు.

ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి తనకు తెలుసని, అయితే మాతృ భాషలోనే పిల్లలు బాగా అర్థంచేసుకోగలరని కుష్బూ పేర్కొన్నారు.
Published by: Janardhan V
First published: July 30, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading