మహేష్,నాగార్జున,రజినీకాంత్ సహా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు..

భారత దేశ రాజకీయాల్లో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో గెలుపుపొంది రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి పలువురు సినీ సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేసారు.

news18-telugu
Updated: May 24, 2019, 6:38 PM IST
మహేష్,నాగార్జున,రజినీకాంత్ సహా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు..
రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీకి సినీ సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ
  • Share this:
భారత దేశ రాజకీయాల్లో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో గెలుపుపొంది రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి పలువురు సినీ సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేసారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసారు.మరోవైపు ఏపీ సీఎంగా ఎన్నికైన వై.యస్.జగన్మోహన్ రెడ్డి బెస్ట్ విషెస్ తెలియజేసారు.మరోవైపు సీనియర్ హీరో నాగార్జున కూడా రెండోసారి ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ప్రధాని మోదీకి బెస్ట్ విషెస్ అందజేశారు.మరోవైపు నవ్యాంధ్ర  ఏపీకి రెండో  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు.అటు రెండోసారి అఖండ మెజారిటీతో ప్రధాన మంత్రి పీఠం అధిరోహించనున్న నరేంద్ర మోదీకి పలువురు కోలీవుడ్,బాలీవుడ్ సహా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. అందులో తమిళ సూపర్ స్టార్  రజిన్ కాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, అనిల్ కపూర్,రాజ్ కుమార్ రావ్, ధర్మేంద్ర, వరుణ్ ధావన్,అజయ్ దేవ్‌గణ్,వివేక్ ఓబరాయ్,అనుపమ్ ఖేర్,రితేష్ దేశ్‌ముఖ్, కంగనా రనౌత్, శిల్పా శెట్టి, రవీనా టాండన్,ఈషా రెబ్బా, హంసా నందిని  ప్రముఖ గాయకుడు ఏ.ఆర్.రహామాన్,కరణ్ జోహార్‌,విశాల్,సిద్దార్ధ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు సంబంధించిన నటీ నటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.


First published: May 24, 2019, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading