కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ మోదీ

దయచేసి దేశాన్ని విడదీయకండి అని కమల్‌ను కోరారు వివేక్. మనమంతా ఒక్కటే అంటూ జైహింద్ అంటూ ట్విట్టర్‌లో మరో పోస్టు కూడా పెట్టారు.

news18-telugu
Updated: May 14, 2019, 10:34 AM IST
కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ మోదీ
వివేక్ ఒబెరాయ్
news18-telugu
Updated: May 14, 2019, 10:34 AM IST
ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్... హిందూ ఉగ్రవాదంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కమల్ కామెంట్లపై ట్విట్టర్‌లో స్పందించిన వివేక్... ట్వీట్ చేశారు. ముస్లీం డామినేటడ్ ఏరియాలో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓట్ల కోసమేనంటూ విమర్శించారు. మీరు గొప్ప కళాకారుడు అంటూనే కమల్‌కు చురకలంటించారు.కళకు ఎలాంటి కులమతాలు ఉండవన్నారు. అలాగే ఉగ్రవాదానికి కూడా మతం ఉండదన్నారు. గాడ్సెను ఉగ్రవాది అన్న మీరు ... హిందూ అన్న పదం ఎందుకు ప్రస్తావించారంటూ కమల్‌ను ప్రశ్నించారు వివేక్ ఒబెరాయ్. ఎందుకంటే ముస్లీంలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యటిస్తూ మీరు చేసిన ఈ కామెంట్స్ ముస్లీం ఓట్ల కోసమేనని ఆరోపణలు చేశారు. ఓ చిన్న ఆర్టిస్ట్‌గా మిమ్మల్ని వేడుకుంటున్నాను.. దయచేసి దేశాన్ని విడదీయకండి అని కమల్‌ను కోరారు వివేక్. మనమంతా ఒక్కటే అంటూ జైహింద్ అంటూ ట్విట్టర్‌లో మరో పోస్టు కూడా పెట్టారు.

ఆదివారం తమిళనాడులో అరవకుచి అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ... ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఎవరో చెప్పి సరికొత్త వివాదానికి తెరలేపారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అని అదికూడా మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అని చెప్పి సరికొత్త వివాదానికి తెరతీశారు. వాస్తవానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఓట్లను ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు తాను చేయడం లేదని ఉన్న వాస్తవాన్ని చెబుతున్నట్లు కమల్ హాసన్ క్లారిటీ కూడా ఇచ్చారు. మరోవైపు బీజేపీ కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలపై మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేసింది.







First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...