చదువుకున్న స్కూల్లో ఓటేసిన ప్రకాష్ రాజ్.. ఆ కిక్కే వేరు..

ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ప్రకాష్ రాజ్ (File)

‘41 ఏళ్ల క్రితం నేను చదువుకున్న స్కూల్. నేను చదువుకున్న బెంచ్. ఈ ప్రదేశంలో ఓటు వేశా. ఇదో కొత్త ప్రయాణం.’ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

  • Share this:
    చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కు ఎప్పుడైనా ఓ సారి వెళితే మనసు పులకరిస్తుంది. అదే మనం కొత్త ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, ప్రత్యేక సందర్భంలో వెళితే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్‌ను నటుడు ప్రకాష్ రాజ్ అనుభవించాడు. కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తాను పోటీ చేస్తున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎంతో ఆనందంగా ఉందని, ఇదో ‘కొత్త ప్రయాణం’ అంటూ ట్వీట్ చేశారు. ‘41 ఏళ్ల క్రితం నేను చదువుకున్న స్కూల్. నేను చదువుకున్న బెంచ్. ఈ ప్రదేశంలో ఓటు వేశా. ఇదో కొత్త ప్రయాణం.’ అని పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయ ఆరంగేట్రం చేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
    First published: