Home /News /politics /

ACTOR RAM POTHINENI ALSO WILL GET NOTICE IF HE TRIES TO DISTURB RAMESH HOSPITAL INVESTIGATION BA

హీరో రామ్‌కు విజయవాడ పోలీసుల షాక్... రమేష్ ఆస్పత్రి విషయంలో కామెంట్స్...

రామ్: గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మార్కెట్ 35 కోట్లకు ఫిక్స్ అయిపోయింది.

రామ్: గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మార్కెట్ 35 కోట్లకు ఫిక్స్ అయిపోయింది.

రమేష్ ఆస్పత్రి విషయంలో సీఎం జగన్ రెప్యుటేషన్ దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని రామ్ పోతినేని అన్నారు.

  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి విజయవాడ పోలీసులు షాక్ ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి విషయంలో విచారణకు ఆటంకం కలిగిస్తే.. రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. హీరో రామ్ నిన్న ఏపీ పోలీసులు, ప్రభుత్వం తీరు మీద విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రామ్ ఘాటుగా ట్వీట్లు చేశారు. అదే స్వర్ణప్యాలెస్‌‌ను రమేష్ ఆస్పత్రి తీసుకునేకంటే ముందే ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నడిపిందని, అప్పుడు ప్రమాదం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన స్వర్ణ ప్యాలెస్‌ యాజమాన్యాన్ని వదిలేసి ఆస్పత్రి మీద అధిక ఫీజుల పేరుతో వేధిస్తున్నారని తప్పుపట్టారు. ఫైర్ ప్లస్ ఫీజు ఈజీక్వల్టూ ఫూల్స్ అంటూ అగ్నిప్రమాదాన్ని, ఫీజులను మిక్స్ చేసి జనాలను ఫూల్స్ చేస్తున్నారంటూ రామ్ ట్వీట్ చేశారు. రమేష్ ఆస్పత్రికి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని, స్వర్ణ ప్యాలెస్‌కు మున్సిపల్ అనుమతులు కూడా లేవని చెప్పారు. అలాగే, ఫీజుల విషయంలో కూడా స్వర్ణ ప్యాలెస్ నేరుగా వసూలు చేసిందని, ఆస్పత్రికి సంబంధం లేదంటూ కొన్ని బిల్లులను కూడా పోస్ట్ చేశారు. సీఎం జగన్ వద్ద పనిచేసే కొందరు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన్ను చెడ్డగా చేసే కుట్ర జరుగుతోందని రామ్ అన్నారు.  ఈ విషయంలో ఈ రోజు ఏసీపీ సూర్యచంద్రరావు సాక్షి టీవీతో మాట్లాడిన సందర్భంగా విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ‘రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. ఆరోగ్యం బాగోలేదు రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలని మెయిల్ చేశారు.ఆయన సోదరుడు ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇంట్లోనే విచారణకు రమ్మన్నారు. నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేక నోటీసులు తీసుకుని విచారణకు ఆటంకం కలిగించడానికి ఈవిధంగా చేస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నాం. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది. రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.’ అని చెప్పినట్టు సాక్షి రిపోర్ట్ చేసింది.  అలాగే, 'సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు. నేడు 91 సీఆర్‌పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపించాలి.ఆస్టర్ గ్రూప్ తో అగ్రిమెంట్, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, వారి బాధ్యత తెలియాలి. హోటల్ వేరు, కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఇందులో పేషన్ట్లు ఉంటారు కాబట్టి.. ప్రతి అంతస్తుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటెన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తాం.' అని సూర్యచంద్రరావు వెల్లడించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ram Pothineni, Vijayawada Fire Accident

  తదుపరి వార్తలు