నేనే సీనియర్... పోసానికి పృథ్వీ కౌంటర్

పోసాని, పృథ్వీ

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై తాను తప్పు మాట్లాడలేదని ఆయన వివరించారు. రైతుల ముసుగులో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులనే తాను విమర్శించానని పృథ్వీ స్పష్టం చేశారు.

  • Share this:
    వైసీపీలో తాను చాలా సీనియర్ అని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. తనపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను తాను అశ్వీరాదంగానే భావిస్తానని ఆయనను వ్యాఖ్యానించారు. వైసీపీలో పృథ్వీ కంటే తాను సీనియర్ అని పోసాని చేసిన వ్యాఖ్యలపై పృథ్వీ పరోక్షంగా స్పందించారు.... తాను చాలా సీనియర్‌ అని... తనకు వైఎస్ఆర్ సమయం నుంచే ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై తాను తప్పు మాట్లాడలేదని ఆయన వివరించారు. రైతుల ముసుగులో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులనే తాను విమర్శించానని పృథ్వీ స్పష్టం చేశారు.

    రాజకీయాల్లో పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి తీసుకొచ్చింది టీడీపీనే అని ఆయన విమర్శించారు. అమరావతి ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలోనే పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ రాజకీయం చేయించిందని ఆరోపించారు. తాము ఏ ఒక్క వర్గాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించే వారిమి కాదని... అది తమ పార్టీ తీరు కూడా కాదని వెల్లడించారు. హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మరోసారి జరగకూడదనే ఆలోచనతోనే సీఎం జగన్... ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని పృథ్వీ తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: