'30 ఇయర్స్' పృథ్వీకి వైసీపీలో కీలక పదవి..

Actor Prudhvi Raj As YSRCP State Secretary: సినీ ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన చాలామంది.. ఆ తర్వాత రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడదే బాటలో హాస్యనటుడు పృథ్వీ నడుస్తున్నాడు.

news18-telugu
Updated: February 16, 2019, 6:52 AM IST
'30 ఇయర్స్' పృథ్వీకి వైసీపీలో కీలక పదవి..
కమెడియన్ ప‌‌ృథ్వీ(File)
news18-telugu
Updated: February 16, 2019, 6:52 AM IST
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన హాస్యనటుడు పృథ్వీరాజ్.. రాజకీయాల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆయన వైసీపీకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మొన్నామధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా.. ఆయనతో కలిసి పార్టీ జెండా పట్టుకుని నడిచారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైసీపీ గొంతును బలంగా వినిపిస్తున్నారు.

పార్టీ కోసం పృథ్వీ చేస్తున్న సేవలను గుర్తించిన వైసీపీ.. తాజాగా ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్‌ని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో తనకు దక్కిన పదవిపై పృథ్వీ సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ తరుపున తాను పోరాడుతానని, ఇందుకోసం వీధి నాటకాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తానని పృథ్వీ ప్రకటించారు.


First published: February 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...