మోదీనే 500 చోట్ల పోటీ చేయొచ్చు కదా ?: ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్(ఫైల్ ఫోటో)

దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని సినీనటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ దేశానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

  • Share this:
    ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని... అలాంటప్పుడు మోదీనే 500 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా ? అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ప్రధాని మోదీకి దేశానికి ఏం చేశారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. తాను ఆప్‌లో లేనని... అయితే ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా నచ్చాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చేది పాలన చేయడానికి కాదన్న ప్రకాశ్ రాజ్... ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దేశంలో రెండు జాతీయ పార్టీల పరిస్థితి బాగాలేదని వ్యాఖ్యానించిన ప్రకాశ్ రాజ్... ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

    ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పిన ప్రకాశ్ రాజ్... బీజేపీ సరైన దారిలో వెళ్లలేదు కాబట్టే ఆ పార్టీని తాను విమర్శిస్తున్నానని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నటుడిగా మారారని ఎద్దేవా చేసిన ఆయన... ఎదుటివారిని తిట్టడమే రాజకీయం అనుకోవడం మూర్ఖత్వమని ధ్వజమెత్తారు. స్థానికంగా సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే... మంచి అభ్యర్థి ప్రధాని అవుతారని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
    First published: