ప్రముఖ సినీ నటి , కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జడ్చర్లలో పర్యటించిన ఆమె... కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు.
నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. సెక్రటేరియట్‌కు వెళ్లని కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే ఉంటూ ప్రజా సమస్యల్ని విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఎంపీ కవిత ఒకరే తెలంగాణలో మహిళ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఖుష్బు మండిపడ్డారు. బతుకమ్మ పేరుతో కవిత భారీగా ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్లో మహిళలకు చోటే లేదన్నారు. మేనిఫెస్టోను కేసీఆర్ ఎప్పుడో మరిచిపోయారన్నారు ఖుష్బు.
ఈ సందర్బంగా వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై కూడా ఆరోపణలు చేశారామె. లక్ష్మారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సునాయాసంగా గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు ఖుష్బు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.