టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్..అప్పట్లో బాబు క్యాబినేట్లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత టీఆర్ఎస్, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
17 ఎంపీ స్థానాలతో దేశాన్ని శాసిస్తే.. మిగతా జాతీయ పార్టీలు ఏం చేయలన్నారు బాబుమోహన్. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశాన్ని కాపాడటం కోసం జరుగుతున్నవన్నారు.
చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు సినీనటుడు, బీజేపీ నేత బాబుమోహన్. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్లో ఎవరూ చనిపోలేదని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ మోదీ కాళ్లు మొక్కారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు మోడీ మంచోడు ఇప్పుడు చెడ్డోడా అంటూ కేసీఆర్ను నిలదీశారు. కేసీఆర్ కిట్ కోసం కేంద్ర లక్షా 30వేల కోట్లు పంపిందన్నారు. కేసీఆర్ చెబుతున్నావన్నీ అబద్ధాలున్నారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను బయటకు చెప్పకుండా, రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు దొరలబంధుగా మారిందని వివర్శించారు. ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి ఇస్తే రైతుకు లాభం జరిగేదన్నారు. 17 ఎంపీ స్థానాలతో దేశాన్ని శాసిస్తే.. మిగతా జాతీయ పార్టీలు ఏం చేయలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశాన్ని కాపాడటం కోసం జరుగుతున్నవన్నారు. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు బాబు మోహన్.
దేశాన్ని కాపడేవారిని ఓటు వేసి గెలిపించాలన్నారు. మోడీ పరిపాలనా గతంలో బాగుందన్నారు. .తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన సమర్థుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి ఎందుకు జరగడం లేదన్నారు బాబుమోహన్. తండ్రి,కొడుకులు పిట్టకథలు బాగనే చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు తీర్పు కేసీఆర్ గమనించాలన్నారు. ఫించన్లు రూ. 200 రాష్ట్రం ఇస్తె కేంద్రం మిగితా డబ్బులు ఇస్తుందన్నారు. అదేవిధంగా రేషన్ బియ్యంలో కూడా కేంద్రం డబ్బులు ఇస్తుందని తెలిపారు. దళిత ద్రోహి కేసీఆర్,రాజయ్య కు చెప్పకుండా ఆరోగ్య శాఖ మంత్రి పదవి తీసేసి వేరే వాళ్ళకు ఇచ్చారన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.