చంద్రబాబు, జగన్ మంత్రుల మధ్య పోటీ పెట్టిన అచ్చెన్నాయుడు

ఈ పోటీకి బొత్స గారూ సిద్ధమేనా అంటూ... ప్రశ్నించారు. ఒకవేళ ఆ పోటీకి సిద్ధం కాకుంటే... ముసలివాణ్ని అని పత్రికా సమావేశంలోనే ఒప్పుకోవాలంటూ ఛాలెంజ్ చేశారు అచ్చెన్న.

news18-telugu
Updated: February 16, 2020, 10:31 AM IST
చంద్రబాబు, జగన్ మంత్రుల మధ్య పోటీ పెట్టిన అచ్చెన్నాయుడు
జగన్, అచ్చెన్నాయుడు
  • Share this:
ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు...సరికొత్త చర్చకు తెర లేపారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఉప్పు నిప్పులా మారింది. దీనికి తోడు రోజురోజుకు మాటల యుద్ధం మరింత ముదురుతుంది. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ ... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. మంత్రి బొత్స మాట్లాడుతూ చంద్రబాబు ముసలివారు అయిపోయారంటూ సెటైర్లు వేశారు. దీనిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. బొత్స చంద్రబాబును ఎగతాళి చేస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరు యువకులు... ఎవరు ముసలివాళ్లు తేల్చడానికి ఒక చిన్న పోటీ పెడదామన్నారు. బొత్స సత్యనారాయణ లేక ...ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ఏ మంత్రిగారైనా సరే... చంద్రబాబు కంటే ముందు కాలినడకన తిరుమల  కొండ ఎక్కండి ? ఎవరు ముందు ఎక్కివతే వారు కుర్రోళ్లు... మిగిలినవారు ముసలోళ్లు అంటూ... సవాల్ చేశారు అచ్చెన్నాయుడు. ఈ పోటీకి బొత్స గారూ సిద్ధమేనా అంటూ... ప్రశ్నించారు. ఒకవేళ ఆ పోటీకి సిద్ధం కాకుంటే... ముసలివాణ్ని అని పత్రికా సమావేశంలోనే ఒప్పుకోవాలంటూ ఛాలెంజ్ చేశారు అచ్చెన్న. ట్విట్టర్ వేదికగా బొత్స వ్యాఖ్యలపై స్పందించిన అచ్చెన్నాయుడు ఈ మేరకు ఏపీ మంత్రులకు కొత్త సవాల్ విసిరారు. మరి దీనిపై అధికార పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు