ఓటుకు నోటు కేసు.. జైల్లో రేవంత్ రెడ్డి .. విచారణ మళ్లీ వాయిదా..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ-1గా ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నందున ఆయన్ను కోర్టులో హాజరుపర్చలేదు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో కూడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించిన కీలక విషయాలను చార్జిషీట్‌లో అధికారులు పొందుపరిచారు. కేసులో ఆడియో టేపుల FSL నివేదికను సైతం కోర్టుకు అప్పగించారు.

    ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వాలని చూసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కీలకం కానుంది. 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బులతో ప్రలోభపెట్టారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: