సుష్మాస్వరాజ్‌పై పాక్ నెటిజన్ ట్వీట్... మండిపడ్డ కేటీఆర్

ఓ నాయకురాలు అకాల మరణం తర్వాత ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ‘

news18-telugu
Updated: August 7, 2019, 10:55 AM IST
సుష్మాస్వరాజ్‌పై పాక్ నెటిజన్ ట్వీట్... మండిపడ్డ కేటీఆర్
సుష్మాస్వరాజ్, కేటీఆర్
  • Share this:
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణం పాకిస్థాన్‌కు చెందిన ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ట్వీట్‌పై  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓ నాయకురాలు అకాల మరణం తర్వాత ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ‘ షోయబ్, మీ ప్రొఫైల్ చెప్పినట్లు మీరు పాకిస్తాన్ నుండి వచ్చినప్పటికీ,  తన జీవితాంతం ఎంతోమంది సేవ చేసిన సుష్మాస్వరాజ్‌జీ వంటి నాయకురాలిని గౌరవించటానికి మీకు కొంత ధైర్యం మర్యాద ఉండాలని నేను భావిస్తున్నా’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

67 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్.  దీంతో ఆమె భౌతిక కాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచీ  ఇంటికి తరలించారు. నేతలు, కార్యకర్తల సందర్శనార్ధం ఉదయం 11 గంటల వరకు ఇంటి దగ్గరే ఉంచబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నట్టు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక లాంఛనాలతో లోదీ రోడ్డులోని స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరపనున్నట్లు ఆయన తెలిపారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>