హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad దెబ్బ : 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ! -రహస్య భేటీపై రచ్చ రచ్చ

Huzurabad దెబ్బ : 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ! -రహస్య భేటీపై రచ్చ రచ్చ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దమ్ముంటే Huzurabad ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలని కాంగ్రెస్ కు సవాలు విసిరిన టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్.. అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదని, బీజేపీతో మిలాఖతైందని, ఈటల రాజేందర్ తో రేవంత్ రెడ్డి రహస్య భేటీనే దానికి సాక్ష్యమని బాంబు పేల్చారు. అయితే, గాడ్సే పెద్ద శిష్యుడితో సీఎం కేసీఆర్ టచ్ లో ఉన్నారని, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..

ఇంకా చదవండి ...

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా జరుగుతోన్న ఉప ఎన్నికగా హుజూరాబాద్ పోరు (Huzurabad bypoll)కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ సైతం దూకుడు పెంచింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగలని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన రహస్య భేటీనే అందుకు సాక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) ఆరోపించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తామిద్దరం కలిసినమాట వాస్తవమేనని, అయితే అది మే నెలలో జరిగిన భేటీనేకానీ, ఎన్నికల ప్రకటన తర్వాత కాదని ఈటల, రేవంత్ వివరణ ఇచ్చుకున్నా టీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై మండిపడుతోన్న కాంగ్రెస్ నేతలు ఓ సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటంటే..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే సుమారు 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ బాంబు పేల్చారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, కాబట్టే గులాబీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పార్టీని వీడబోతున్నారని షబ్బీర్ అలీ చెప్పారు.

Instagram : అమ్మాయి మోసం చేస్తే కుటుంబం కాపాడింది.. కానీ నవీన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..


బీజేపీ నేత ఈటలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీని ‘గాంధీ భవన్ లో గాడ్సే’గా టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న క్రమంలో, ‘ప్రగతి భవన్ లో తెలంగాణ ద్రోహులు’అంటూ కాంగ్రెస్ కౌంటర్లు వేస్తోంది. షబ్బీర్ అలీ మరో అడుగు ముందుకేసి.. ‘ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోంది. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం సీఎం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలి’అని షబ్బీర్ అలీ డిమాండ్‌ చేశారు.

Matchbox : అమ్మ బాబోయ్.. అగ్గి పెట్టె ధర 2రూపాయలు -14ఏళ్ల తర్వాత పెంపు -ఇక రూపాయికి వచ్చే వస్తువేది?


ఈటల-రేవంత్ భేటీపై టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌ గాలి మాటలు మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భిన్నధృవాల్లాంటి కాంగ్రెస్, బీజేపీ ఎన్నటికీ కలవబోవన్న ఆయన.. గాంధీభవన్‌లో గాడ్సేలకు స్థానం లేదని స్పస్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం కూడా ఊహాగానమేనని భట్టీ అన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Congress, Huzurabad, Huzurabad By-election 2021, Trs

ఉత్తమ కథలు