• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ABHINANDAN RETURNINDIA WANTED TO SEND PLANE TO BRING BACK PILOT PAK REFUSED SOURCES

అభినందన్‌ను ప్రత్యేక విమానంలో తీసుకురావాలనుకున్న భారత్.. ప్రతిపాదనకు ఒప్పుకోని పాక్

అభినందన్‌ను ప్రత్యేక విమానంలో తీసుకురావాలనుకున్న భారత్.. ప్రతిపాదనకు ఒప్పుకోని పాక్

అభినందన్ వర్ధమాన్

Abhinandan Return : అభినందన్‌ను విడుదల చేస్తున్నామని గురువారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన కొద్దిసేపటికే భారత్ ఈ ప్రతిపాదన పంపించింది. అంతేకాదు, ప్రత్యేక విమానంలో పైలట్ అభినందన్‌తో పాటు ఉండే అధికారుల జాబితాను కూడా పాకిస్తాన్‌కు పంపించింది.

  • Share this:
    భారత వైమానిక దళ వింగ్ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు ద్వారా కాకుండా ప్రత్యేక విమానం ద్వారా పంపించాలన్న భారత ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. అటారీ-వాఘా సరిహద్దు ద్వారానే అభినందన్‌ను భారత్ పంపిస్తామని పాకిస్తాన్ భారత వర్గాలకు వెల్లడించింది. గురువారం రాత్రే దీనిపై పాక్ భారత్‌కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

    వాఘా సరిహద్దు ద్వారా అభినందన్‌ను భారత్‌కు అప్పగించినట్టయితే.. అక్కడ గుమిగూడే వేలాది మంది జనం, మీడియాను అదుపు చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతోనే ప్రత్యేక విమానంలో అభినందన్‌ను పంపించాలని భారత్ కోరినట్టు సమాచారం. అభినందన్‌ను విడుదల చేస్తున్నామని గురువారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన కొద్దిసేపటికే భారత్ ఈ ప్రతిపాదన పంపించింది.

    అంతేకాదు, ప్రత్యేక విమానంలో పైలట్ అభినందన్‌తో పాటు ఉండే అధికారుల జాబితాను కూడా పాకిస్తాన్‌కు పంపించింది.అభినందన్‌ను ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీ తీసుకొచ్చి.. వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ భావించింది. అయితే భారత ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించడంతో వాఘా సరిహద్దు ద్వారానే అభినందన్ భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు.వేలాది మంది జనం నినాదాల మధ్య, ఉద్విగ్నపూరిత వాతావరణంలో ఆయన భారత్‌లో అడుగుపెట్టబోతుండటం ఉత్కంఠను రేపుతోంది.

    First published: