హోమ్ /వార్తలు /National రాజకీయం /

పాంప్లీట్ల రచ్చ.. ఏడ్చేసిన ఆప్ అభ్యర్థి.. ఖండించిన గౌతం గంభీర్

పాంప్లీట్ల రచ్చ.. ఏడ్చేసిన ఆప్ అభ్యర్థి.. ఖండించిన గౌతం గంభీర్

పాంప్లీట్లను చూపుతున్న అతిషి (Screen Grab/ANI)

పాంప్లీట్లను చూపుతున్న అతిషి (Screen Grab/ANI)

ఎన్నికల ప్రచారంలో ఆతిషికి వ్యతిరేకంగా గౌతం గంభీర్ పాంప్లీట్లు పంచుతున్నారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు.

తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి ఆతిషి కన్నీరు పెట్టుకున్నారు. తన మీద అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలతో పాంప్లీట్లు ప్రింట్ చేయించి వాటిని ప్రజలకు పంపిణి చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాంప్లీట్లలో ఏం రాశారో చదువుతుండగా.. దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీరు పెట్టుకున్నారు. తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ తరఫున ఆతిషి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి గౌతం గంభీర్ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఆతిషికి వ్యతిరేకంగా గౌతం గంభీర్ పాంప్లీట్లు పంచుతున్నారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఆ పాంప్లీట్ లోని కామెంట్స్‌ను చదువుతూ తట్టుకోలేకపోయారు. గౌతం గంభీర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను స్వాగతించానని, ఇప్పుడు గంభీర్, బీజేపీ ఇంత నీచస్థితికి దిగజారతాయని ఊహించలేదంటూ ఆమె కన్నీరుపెట్టుకున్నారు. సంచరజాతికి ఆమె ప్రత్యక్ష ఉదాహరణ అని ఆ పాంప్లీట్‌లో రాసి ఉందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఆప్ అభ్యర్థి ఆతిష్, ఆ పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణలను గౌతం గంభీర్ ఖండించారు. ఆ పని తానే చేశానని ఆధారాలు తీసుకొస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ మే 23 లోపు తీసుకొస్తే కూడా తాను రాజీనామా చేస్తానని గౌతం గంభీర్ స్పష్టం చేశారు. అయితే, అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాలు తీసుకురాలేరని, తన సవాల్‌ను స్వీకరించలేరని గంభీర్ అన్నారు. కేజ్రీవాల్ తన సవాల్ స్వీకరించి.. ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని స్పష్టం చేశారు.

First published:

Tags: AAP, Bjp, Delhi Lok Sabha Elections 2019, Gautam Gambhir

ఉత్తమ కథలు