Home /News /politics /

AAP PRESIDENT KEJRIWAL DAUGHTER HARSHITA KEJRIWAL IMPRESSES VOTERS DURING PUNJAB ELECTION CAMPAIGN SNR

Punjab:చీపురు గుర్తు పార్టీకి కేజ్రీవాల్‌ వారసులు..ఎవరై ఉంటరబ్బా


Photo Credit:Twitter

Photo Credit:Twitter

Harshita Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుమార్తె పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఆప్‌ అభ్యర్ధుల తరపున ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసందిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తమ పార్టీని గెలిపిస్తే పంజాబ్‌లో ఎలాంటి అభివృద్ది జరుగుతుందో ఢిల్లీలో తండ్రి పాలనను ఉదాహరణగా చూపిస్తోంది హర్షిత కేజ్రీవాల్.

ఇంకా చదవండి ...
రాజకీయాలు ఎవరికి నేర్పించాల్సిన అవసరం ఏర్పడటం లేదు. దేశంలో అన్నీ పార్టీల నుంచి ఆయా పార్టీ అధినాయకుల వారసులు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం, లేదంటే వారి తల్లిదండ్రులకు పరోక్షంగా రాజకీయ తోడ్పాటు అందించడం జరుగుతూ వస్తోంది. రీసెంట్‌గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అంటూ మరో రాజకీయ పార్టీకి వారసురాలు తెరపైకి వచ్చింది. సమాజంలో చెత్తలా పేరుకుపోయిన రాజకీయాలను చీపురుతో ఊడ్చేస్తానంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపించి రెండు సార్లు దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుమార్తె (Kejriwal daughter)హర్షిత కేజ్రీవాల్‌(Harshita Kejriwal)పేరు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ఆప్ పార్టీ పోటీ చేస్తున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్షిత కేజ్రీవాల్‌ పంజాబ్‌( Punjab)ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మాట్లాడిన విధానం, తండ్రి పాలనలో ఢిల్లీ( Delhi)లో జరిగిన అభివృద్ది, నూతన సంస్కరణలు పంజాబ్‌ ప్రజలకు విడమర్చి చెప్పిన విధానం అందరిని ఆకర్షిస్తోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో హర్షిత కేజ్రీవాల్ ఆప్ సీఎం అభ్యర్ది భవవంత్‌మాన్‌సింగ్ (Bhagwant Singh Mann) తరపున ప్రచారాన్ని చేపట్టారు. పంజాబ్ ఓటర్లు పని చేసే వాళ్లను గుర్తించి ఓటేయాలని కోరారు. పాతికేళ్ల వయసున్న హర్షిత ఐఐటీ గ్రాడ్యూయేట్‌ (IIT Graduate)పూర్తి చేసింది. పంజాబ్‌ ఎన్నికల ప్రచారం కోసం తల్లి సునీత కేజ్రీవాల్‌తో కలిసి ఓటర్లను ఆప్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే వెళ్లిన ప్రతిచోట రాజకీయ ప్రసంగాన్ని సత్‌శ్రీ అకల్‌తో ప్రారంభించడం అందర్ని ఆలోచింపజేసింది. పంజాబ్ యువతకు మేలు చేయడమే ఆమ్ ఆద్మీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హర్షిత ప్రచారంలో మాట్లాడిన విధానం చూస్తుంటే అందరికి అర్దమవుతోంది. విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ అని హర్షిత ఎన్నికల సభలో పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ సీఎం అయిన తర్వాత విద్యావ్యవస్థను మెరుగుపరిచిన విధానం దేశాన్నేకాదు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిందని ఆమె తండ్రి పాలన గురించి గొప్పగా పొడిగారు. హర్షిత కేజ్రీవాల్ రాజకీయ ప్రసంగ చూస్తుంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఉంది.

కేజ్రీవాల్ రాజకీయ వారసురాలు..
ఎన్నికల ప్రచారానికి వచ్చిన హర్షిత కేజ్రీవాల్‌ రాజకీయ సభల్లో ఎలా మాట్లాడాలో తనకు తెలియదని...కాకపోతే పంజాబ్ పౌరుల ఉత్సాహమే నాకు కొత్త ఊపిరిని పోసినట్లుగా ఉందంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టింది. పంజాబ్‌లో ఆప్‌ తరపున సీఎం అభ్యర్ది భవవంత్‌మాన్‌ సింగ్‌ తన మేనమామ అని స్థానిక నేతల్ని హర్షిత ఓన్ చేసుకున్నారు. తన మామయ్య కోసం ఇక్కడికి వచ్చాను అంటూ ఆమె ర్యాలీలో చెప్పడం అందర్ని ఆకట్టుకునేలా చేసింది.

ప్రజాసేవకే మేం వచ్చింది..
చివరగా తన తండ్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ గురించి మాట్లాడుతూ తన తండ్రికి రాజకీయాలు కుటుంబం కాదని వాటిని వ్యాపారంగా చేసుకునేందుకు సీఎం కాలేదని కేవలం సామాజిక సేవ చేయడంతో పాటు ప్రజలకు సహాయం చేసేందుకు ..దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చారని చెప్పారు హర్షిత కేజ్రీవాల్. చివరిగా తన తండ్రి కేజ్రీవాల్ డ్యూటీ చేస్తున్నారని...నా డ్యూటీ నేను చేయాలి నా కాళ్లపై నేను నిలబడాలన్నారు. తానే కాదు పంజాబ్‌ పంజాబ్‌లోని ప్రతి యువకుడు, ప్రతి యువతి చదువుకుని తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం రావాలంటూ హర్షిత కేజ్రీవాల్ చేసిన రాజకీయ ప్రసంగం ఇప్పుడు ఆ పార్టీకి పంజాబ్‌లోనే కాదు ఆప్‌ పోటీ చేస్తున్న చాలా చోట్ల ప్లస్ అయ్యేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కచ్చితంగా అరవింద్‌ కేజ్రీవాల్‌కి సరైన రాజకీయ వారసురాలు వచ్చేసిందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: AAP, Arvind Kejriwal, Assembly Election 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు