HOME »NEWS »POLITICS »aap mla alka lamba says arvind kejriwal unfollowed her on twitter

కేజ్రీవాల్ ఇబ్బంది పెడుతున్నారు...ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆరోపణ

కేజ్రీవాల్ ఇబ్బంది పెడుతున్నారు...ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా

తాను ఆమ్ ఆద్మీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే అల్కా లాంబా తోసిపుచ్చారు.

  • Share this:
    ఆమ్ ఆద్మీ పార్టీని తనకు తానుగా వీడేలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా ఆరోపించారు. ట్విట్టర్‌లో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తనను అన్‌ఫాలో చేశారని తెలిపారు. అలాగే పార్టీకి సంబంధించిన వాట్సప్ గ్రూప్ నుంచి కూడా తనను తొలగించారని ఆమె వెల్లడించారు. పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదన్నారు. పార్టీలో తన స్థానం ఏంటో చెప్పాలని వివరణ కోరుతూ పార్టీ నేతలకు మొబైల్ ఫోన్‌లో సందేశాలు పంపినట్లు చెప్పారు.

    ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం తనకు ఇబ్బందికరంగా మారుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ తన సేవలను కోలుకోవడం లేదన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. తన ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అయితే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతూ...తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చాంద్నీ చౌక్ ఎమ్మెల్యే లాంబా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.



    అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అల్కా లాంబా తోసిపుచ్చారు. ఆప్ లేదా ఆప్ నేతలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, మరి తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎలా భావిస్తారని ప్రశ్నించారు.
    Published by:Janardhan V
    First published:February 05, 2019, 13:11 IST