హైదరాబాద్‌పై కన్నేసిన ఆప్... ఆ ఎన్నికలే లక్ష్యం

ఢిల్లీలో ఆప్ ఘనవిజయానికి సుపరిపాలనే కారణమనే వాదనలు వినిపిస్తుండటంతో... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రకమైన నినాదంతో ముందుకు సాగాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 14, 2020, 3:22 PM IST
హైదరాబాద్‌పై కన్నేసిన ఆప్... ఆ ఎన్నికలే లక్ష్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ ఎన్నికల తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాద్‌పై ఫోకస్ పెంచిందా ? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీలో ఆప్ ఘనవిజయానికి సుపరిపాలనే కారణమనే ప్రచారం జరగడంతో... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రకమైన నినాదంతో ముందుకు సాగాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ గెలుపు కోసం నగరం నుంచి సైతం కొంతమంది ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆప్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఢిల్లీ తరహా పాలన చేస్తామనే హామీలతో ప్రజల ముందుకు వెళ్లాలని ఆప్ స్థానిక నేతలు భావిస్తున్నారు.

అవసరమైతే కేజ్రీవాల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రచారం చేయించాలని పలువురు నేతలు అనుకుంటున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ తరపున టికెట్లు రానివారు ఆప్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇది కూడా ఆప్‌కు కలిసొచ్చే అంశమని ఆ పార్టీ భావిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధం కావాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీలో ఆప్ సాధించిన ఘనవిజయం... హైదరాబాద్‌లోని ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపినట్టు కనిపిస్తోంది.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు