జగన్‌కు వరంలా మారనున్న కేజ్రీవాల్ విజయం ?

ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ శాసనమండలి రద్దు నిర్ణయానికి ఆమోదం తెలుపుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

news18-telugu
Updated: February 12, 2020, 11:50 AM IST
జగన్‌కు వరంలా మారనున్న కేజ్రీవాల్ విజయం ?
వైఎస్ జగన్, కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గెలుపు కలిసి రానుందా ? కేజ్రీవాల్ భారీ విజయం కేంద్రం, బీజేపీ దగ్గర జగన్ ప్రాధాన్యత పెరిగేందుకు కారణమవుతుందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నేడు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్న సీఎం వైఎస్ జగన్... ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరనున్నట్టు సమాచారం.

ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ శాసనమండలి రద్దు నిర్ణయానికి ఆమోదం తెలుపుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ ఎంతో ధీమా ఉంది. తాజాగా సీఎం జగన్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో... బీజేపీ కూడా శాసనమండలి రద్దుకు సానుకూలంగా సంకేతం ఇచ్చినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా జాతీయ మీడియా ప్రతినిధులతో జరిపిన చర్చల్లోనే బీజేపీకి తమ అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు సీఎం జగన్.

అప్పుడు తమ ప్రధాన డిమాండ్లయిన ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని... రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను ఇస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విజయంతో కొన్ని ప్రాంతీయ పార్టీలు తమతో ఉండేలా బీజేపీ ప్లాన్ చేసుకుంటోందని... ఈ క్రమంలోనే ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని పలువురు అంచనా వేశారు. మొత్తానికి ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపు... ఏపీ సీఎం జగన్‌కు అనుకోని వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు