Viral Video: రూ. 500లకు అమ్ముడుపోతే పరిస్థితి ఇలానే ఉంటది.. వీడియో వైరల్..

నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్ కార్యకర్తలు

Viral Video: ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే.. ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. ప్రత్యర్థికి సంబంధించి లోపాలను ఎత్తి చూపిస్తూ.. తమవైపు ఆకర్శించుకునే విధంగా చేస్తుంటారు. ఇలా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లంతా గుంతలమయం కావడంతో ఆ నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

  • Share this:
    ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే.. ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. ప్రత్యర్థికి సంబంధించి లోపాలను ఎత్తి చూపిస్తూ.. తమవైపు ఆకర్శించుకునే విధంగా చేస్తుంటారు. ఇలా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లంతా గుంతలమయం కావడంతో ఆ నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఒక్క ఓటును రూ.500 తీసుకొని ఆ నాయకులకు అమ్ముడుపోతే.. రోడ్ల పరిస్థితి ఇలానే ఉంటుందని.. విమర్శించారు. ఈ మేరకు వాళ్లు ఫ్లకార్డులను ప్రదర్శించడంతోపాటు రోడ్లపై నీటితో ఉన్న గుంతల వద్ద డ్యాన్స్‌ చేశారు.



    ఈ వీడియోతోపాటు గాంధీనగర్‌లోని రెండవ వార్డులో నీట మునిగిన రోడ్ల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతేకాదు.. బీజేపీ నేతలను వాళ్లు దృష్టిలో పెట్టుకొని గాంధీనగరల్ లోని నేతలు వినియోగించే రోడ్లు మాత్రమే బాగుండాలా.. మిగతా సామాన్యులు నివసించే ప్రదేశాల్లో రోడ్డు మంచిగా ఉండాల్సిన అవసరం లేదా.. అంటూ.. ప్రశ్నించారు.



    ఇలా గుజరాత్ లోని గాంధీనగర్ లో వార్డు నంబర్ 2 లోని రోడ్లపై ఏర్పడిన గుంతలను వాళ్లు వీడియోలు తీస్తూ.. నేతలను విమర్శిస్తూ.. సోషల్ మాడియాలో పోస్టులను పెట్టారు. ఆప్ కార్యకర్తలు పెట్టిన పోస్టులకు కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఆప్ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి లేదా.. వర్షం కారణంగా గుంతలు పడటం సహజమని.. ఢిల్లీలో కూడా ఇలాంటివి గల్లీ గల్లీలో ఉన్నాయంటూ.. వారికి రీట్వీట్ గా అక్కడ రోడ్లపై, ఎయిర్ పోర్టు దగ్గర ఏర్పడిని గుంతలను వీడియో తీసి మరీ వీళ్లకు కౌంటర్ గా వీడియోలను పోస్టు చేశారు.



    ఇలా ఆప్ కార్యకర్తలకు.. నెటిజన్లకు మధ్య సోషల్ వార్ నడిచినట్లు అయింది. ఏదేమైనా వీళ్లు చేసే నిరసనతో చాలామంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: