• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AANDHRA PRADESH GOVERNMENT EXTENDED SPECIAL OFFICERS RULE IN LOCAL BODIES PRN

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..! సీఎం జగన్ పంతం నెగ్గినట్లేనా..?

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..! సీఎం జగన్ పంతం నెగ్గినట్లేనా..?

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో జిల్లా పరిషత్ లలో జనవరి 5 నుంచి, మండల పరిషత్ లలో జనవరి 4 నుంచి ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వాని మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరగాల్సి ఉంది. ఐతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది. స్థానిక సంస్థల పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఐతే అప్పటి నుంచి ప్రతి ఆరు నెలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూడా ఉత్తర్వులను పొడిగిస్తోంది. ఈనెల 4,5 తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలన ముగుస్తుండటంతో మరోసారి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    ఎన్నికలపై తీవ్ర వివాదం
    వాస్తవానికి గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఐతే కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో వివాదం రేగింది. ఈ అంశంపైనే కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు ప్రభుత్వం-ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో పోరాడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో తమను సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వం మండిపడింది. ఆ తర్వాత ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం., దీనిపై కోర్టులో నిమ్మగడ్డ గెలవడం.., మళ్లీ బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రీఎంట్రీ తర్వాత స్థానిక ఎన్నికలే కేంద్రంగా మళ్లీ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. వెంటనే ప్రభుత్వ ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దంటూ ఎస్ఈసీ..గవర్నర్ కు లేఖ రాశారు.

    స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం పట్టువీడటం లేదు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని గట్టిగా భావిస్తోంది. ఈ ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఎస్‌ఈసీతో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు