Home /News /politics /

AAM AADMI PARTY PLANS TO SEND FORMER TEAM INDIA CRICKETER HARBHAJAN SINGH TO RAJYA SABHA ON BEHALF OF PUNJAB SNR

Harbhajan Singh: పంజాబ్‌లో పొలిటికల్ చైర్ గేమ్..సిద్ధూ ఔట్ భజ్జీ ఇన్..!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Punjab: పంజాబ్‌లో ఓ మాజీ క్రికెటర్‌ పదవి వదులుకుంటే ..మరో మాజీ క్రికెటర్‌కి పదవి దక్కబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ మార్పుతో టీమిండియా మాజీ క్రికెటర్ల తలరాతలు మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది.

పంజాబ్‌(Punjab)పాలిటిక్స్‌లో భల్లే భల్లే సిద్దు ఎపిసోడ్‌ క్లోజ్ అయితే..భజ్జీ ఇన్నింగ్స్‌ స్టార్స్‌ అయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన ఆప్‌ సర్కారు టీమిండియా మాజీ క్రికెటర్, స్పీన్ బౌలర్ హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh)కి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. హర్భజన్‌ని రాజ్యసభ(Rajya Sabha)కు పంపాలనే యోచనలో ఉన్నట్లుగా జాతీయ మీడియా(Article in national media)లో ఓ ఆసక్తికర కథనం ప్రచురితమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత భగవంత్‌మాన్‌(Bhagwantman)కి ట్విట్టర్‌(Twitter) ద్వారా కంగ్రాట్స్ చెప్పారు భజ్జీ. దీన్ని బట్టి చూస్తే జాతీయ మీడియా కథనం వాస్తవమే అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే హర్భజన్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. దానికి బదులుగానే స్పిన్‌ బౌలర్ కూడా పంజాబ్‌కు సేవ చేయాల‌ని ఉంద‌ని చెప్పాడు. రాజ‌కీయాల్లోకి రావడం ఖాయమైతే తానే ప్ర‌క‌టిస్తాన‌ని గతంలోనే స్పష్టం చేశాడు. అన్ని పార్టీల‌తోనూ హర్భజన్‌కి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన భజ్జీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేయకుండా తటస్థంగా ఉన్నారు.

భల్లే భల్లే ఔట్..భజ్జీ ఇన్..
పంజాబ్‌లో ఆప్‌ పట్టు నిలుపుకోవడంతో పాటు పార్టీని స్ట్రెంగ్తెన్‌ చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. అందుకే సెలబ్రిటీ, క్రికెటర్‌ అయిన హర్భజన్‌ని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందనే ఆలోచిస్తున్నాట్లుగా సమాచారం. భజ్జీని రాజ్యసభకు పంపే విషయంపై తుది నిర్ణయం, అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌కు చెందిన హ‌ర్భ‌జ‌న్‌... 1998 నుంచి 2016 వ‌ర‌కు భార‌త క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడిగా కొన‌సాగాడు. భార‌త్ త‌ర‌ఫున 103 టెస్టులు, 236 వ‌న్డేలు, 28 టీ20లు ఆడిన భ‌జ్జీ.. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు ఆడాడు.

పొలిటికల గేమ్..
పంజాబ్‌ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం ఈ ఫలితాల తర్వాతే చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న కాంగెస్‌ పార్టీ ఓడిపోవడంతో అందుకు నైతిక బాధ్యతగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్,ఇండియన్ మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు పదవికి రాజీనామా చేశారు. పంజాబ్‌లో ఏర్పడిన ఆప్ ప్రభుత్వం మరో టీమిండియా మాజీ క్రికెటర్‌ అయినటువంటి హర్భజన్‌ని రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకోనుందట.
Published by:Siva Nanduri
First published:

Tags: AAP, Navjot Singh Sidhu, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు