AADHAAR MUST FOR RYTHU BHEEMA IN ANDHRA PRADESH GOVERNMENT ISSUE NEW GO NGS
Andhra Pradesh: రైతు బీమా పొందాలంటే ఇకపై ఇలా చేయాలి. కానీ అది తప్పనిసరి అంటున్న ప్రభుత్వం
నేడే రైలు ఖాతాల్లోకి ఉతిత భీమా
ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇక ఆధార్ కార్డు తప్పని సరి.. లేదంటే రైతు బీమా కాని రాయితీలు కాని రావు. ఆధార్ లేని రైతు ఇకపై వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే. లేదంటే ముందుగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
ఈ మధ్య ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి అనే మాట తప్పక వినాల్సి వస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు శుభవార్త చెప్పింది. కానీ కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు సంఖ్య ఉండాలని.. లేదంటే ఆ రెండు ఇవ్వడం కుదరదని స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించి తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ రైతు భరోసా కేంద్రం నిర్వాహకులకు మార్గదర్శనం చేసింది.
అన్నదాతలు ఎవరైనా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయం, రాయితీలు, ఇతర సేవలకు ఆధార్ ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. ఒకవేళ అర్హులైన రైతులకు ఆధార్ కార్డు లేకపోతే.. బీమా పొందడానికి కొంత సమయం వెయిట్ చేయాల్సిందే. బీమా రావాలి అంటే ముందుగా ఆధార్ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతు భరోసా కేంద్రాల్లో ఆధార్ నమోదు కోసం.. ఏవైనా ఎనిమిది రకాల గుర్తింపు పత్రాలు, లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే దీంతో రైతులు ప్రభుత్వ రాయితీ పథకాలను పొందటానికి బహుళ ధ్రువీకరణ పత్రాల అవసరాన్ని పూర్తిగా తొలగించి, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగానే ఆధార్ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఈ షరతు సంగతి ఎలా ఉన్నా? రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం, జీరో వడ్డీతో రుణాలు అందిస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. కోల్డ్ స్టోరేజ్‌లు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగేలా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు తాజాగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతు భరోసా తొలి విడత సొమ్ముతో పాటు 2020 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని మే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. 2019 పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీని ఏప్రిల్, 2020 ఖరీఫ్ రుణాలపై వడ్డీ రాయితీని ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు కూడా పరిహారాన్ని ఆగస్టులో చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు తాజాగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నవరత్నాల నెలవారీ క్యాలండర్‌ను ప్రభుత్వం నిన్ననే విడుదల చేసింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.