హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు... ఆరా సర్వే

గతంలో అనేకసార్లు ఎన్నికల ఫలితాలపై సర్వే అంచనాలను వెల్లడించిన ఆరా సంస్థ... హుజూర్ నగర్‌ ఉప ఎన్నికల్లోనూ సర్వే నిర్వహించింది.

news18-telugu
Updated: October 21, 2019, 6:14 PM IST
హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు... ఆరా సర్వే
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 21, 2019, 6:14 PM IST
ఉత్కంఠభరితంగా సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది ? టీఆర్ఎస్, కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గారు ? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. గెలుపు తమదే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. అయితే ఓ సర్వే సంస్థ మాత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని అభిప్రాయపడింది. గతంలో అనేకసార్లు ఎన్నికల ఫలితాలపై సర్వే అంచనాలను వెల్లడించిన ఆరా సంస్థ... హుజూర్ నగర్‌ ఉప ఎన్నికల్లోనూ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు 50.48 శాతం, కాంగ్రెస్‌కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు రావొచ్చని సంస్థ అభిప్రాయపడింది. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరగనుంది. మరి ఈ సర్వే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...