• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • A VILLAGE IN WEST GODAWARI DISTRICT OF ANDHRA PRADESH HAVING PANCHAYAT ELECTIONS FOR THE FIRST TIME IN 64 YEARS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఆ ఊళ్లో 64ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు... ఎక్కడో తెలుసా..?

AP Panchayat Elections: ఆ ఊళ్లో 64ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు... ఎక్కడో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

దేశంలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections) జరుగుతున్నాయి. ఐదేళ్లకోసారి గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్లు మారుతున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమవగా.. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. మూడో విడత నామినేషన్లు కూడా మొదలయ్యాయి. దేశంలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదేళ్లకోసారి గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్లు మారుతున్నారు. కానీ రాష్ట్రంలోని ఓ గ్రామంలో 64 ఏళ్లుగా స్థానికులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదంటే నమ్ముతారా.? అసలు ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తప్ప పోలింగ్ మాత్రం ఇంతవరకు జరగలేదు. ఆ గ్రామం ఏర్పడిన తర్వాత సర్పంచ్ ఎన్నికంతా ఏకగ్రీవమే. 1957 నుంచి ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేసిన దాఖలాలు లేనేలేవు. కానీ ఇప్పుడు సీన్ మారింది.. ఆ గ్రామంలో రాజకీయం మొదలైంది.

    పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేరు పరిధిలో ఉన్న పత్తికోళ్లలంక గ్రామంలో తొలిసారిగా గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. పత్తికోళ్ల లంక గ్రామం 1957లో ఏర్పడింది. అప్పటి నుంచి 2013 వరకు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. గ్రామంలో మొత్తం 3096 ఓట్లు ఉన్నాయి. అక్కడ అందరికీ ఒకటే మాట. కానీ 2013 నుంచి సీన్ మారింది. రాజకీయ ఆధిపత్యంతో గ్రూపులు పెరిగిపోయాయి. నాటకీయ పరిణామాల మధ్య గతంలో ఏకగ్రీవమైన పంచాయతీకి ఈసారి ఎన్నికలు తప్పలేదు. ఈసారి పత్తికోళ్ల లంకకు మాజీ సర్పంచ్ మహాలక్ష్మి రాజు.. ఆయన వైరి గ్రూపుకు చెందిన బలే ఆనంద్ నామినేషన్ వేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని వేడెక్కించారు. తొలిసారి ఓటు వేయబోతున్న గ్రామస్తుల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

    సాధారణంగా కొల్లేరు గ్రామాల్లో రాజకీయాలుండవ్.. లంక గ్రామాల్లోని ప్రజలందరిదీ ఒకటే మాట. రాజకీయ వివాదాలకు దూరంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతుండేవి. కానీ ఇటీవల కాలంలో అక్కడ రాజకీయ ఆధిపత్యమే కనిపిస్తోంది. అక్రమంగా చెరువుల తవ్వకాలు, చేపల చెరువులు, లీజుల్లో అవకతవకలు, పెత్తనాల కోసం పోరాటాలే కనిపిస్తాయి. చాలా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిందే వేదం. ఆయన చెప్పిన వాళ్లే అక్కడ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు. కానీ కానీ ఇప్పుడు స్థానికుల్లో కాస్త మార్పు వస్తోంది. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులకు లొంగని వారు పోటీకి సై అంటున్నారు.
    Published by:Purna Chandra
    First published: