గెలిపించినందుకు 120మందికి గుండు.. ఈ సర్పంచ్ భర్త భలే కొత్తగా ఆలోచించాడు!!

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ స్వరూప భర్త శ్రీనివాస్.. ఎన్నికల్లో తన భార్యకు మద్దతుగా నిలబడినవాళ్లకు ఊహించని ఆఫర్ ఇచ్చాడు.

news18-telugu
Updated: February 11, 2019, 12:50 PM IST
గెలిపించినందుకు 120మందికి గుండు.. ఈ సర్పంచ్ భర్త భలే కొత్తగా ఆలోచించాడు!!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 12:50 PM IST
ఎన్నికలంటేనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం. ప్రలోభాలతో గెలిచామా.. పనితీరుతో గెలిచామా.. అన్నది తర్వాత సంగతి.. గెలిచామా లేదా అన్నదే అభ్యర్థుల పాయింట్. కాబట్టి ఎన్నికలవేళ తాయిలాల ప్రకటనలు కామన్. అయితే అందరిలాగే మనమూ అవే రొటీన్ తాయిలాలు ప్రకటించడం ఎందుకున్నాడో ఏమో గానీ.. మెదక్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ భర్త.. కాస్త భిన్నంగా ఆలోచించాడు.

తన భార్య సర్పంచ్‌గా గెలిస్తే తిరుపతి వస్తానని మొక్కుకున్న అతను.. ఎన్నికల్లో గెలవడంతో గ్రామానికి చెందిన 120మందిని తనతో పాటు తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. సొంత ఖర్చులతో మూడు బస్సుల్లో వారందరినీ తిరుపతి తీసుకెళ్లి.. అందరికీ గుండ్లు చేయించి తీసుకొచ్చాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ స్వరూప భర్త శ్రీనివాస్ ఈ వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కాడు.

ఎన్నికల సమయంలో వందో.. వెయ్యో చేతిలో పెట్టి తర్వాత మరిచిపోయే ఈరోజుల్లో.. గెలిచాక తమ అందరిని తిరుపతి తీసుకెళ్లి వెంకన్న దర్శనం చేయించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...