Budget 2019: పన్ను చెల్లింపుదారులకు మోదీ బంపరాఫర్.. అదేంటంటే..

ఇప్పటికే రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి సంచలనానికి తెర తీసిన మోదీ.. పన్ను చెల్లింపుదారులకు బంపరాఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: June 10, 2019, 4:28 PM IST
Budget 2019: పన్ను చెల్లింపుదారులకు మోదీ బంపరాఫర్.. అదేంటంటే..
నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 10, 2019, 4:28 PM IST
పన్ను వసూళ్లు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశ రాజకీయ, ఆర్థిక రంగాల చరిత్రలోనే తొలిసారిగా వినూత్న నిర్ణయానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి సంచలనానికి తెర తీసిన మోదీ.. పన్ను చెల్లింపుదారులకు బంపరాఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం. అదేంటంటే.. ఎక్కువ పన్నులు చెల్లించేవారు ప్రధాని మోదీతో ఛాయ్ తాగే అవకాశం కల్పిస్తారట. జూలై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సందర్భంగా కేంద్రం ఈ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పటికే ట్యాక్స్ ఎక్కువగా, క్రమబద్ధంగా కడుతున్నవారికి ఆదాయపన్ను శాఖ ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేస్తోంది.



First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...