A PITITION WAS LODGED TO STOP THE HALIYA ELECTION MEETING VS
ఉప ఎన్నిక : హలియాలో సీఎం ఎన్నికల సభను నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు, కోర్టులో లంచ్మోషన్
ఉప ఎన్నిక : కరోనా నిబంధనల దృష్ట్యా ఈ నెల 14న అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయో బహిరంగ సభను నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేసిన యుగతులసి, గోసేన ఫౌండేషన్ చైర్మన్ కే శివ కుమార్
ఉప ఎన్నిక : కరోనా నిబంధనల దృష్ట్యా ఈ నెల 14న అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయో బహిరంగ సభను నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేసిన యుగతులసి, గోసేన ఫౌండేషన్ చైర్మన్ కే శివ కుమార్
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభకు బ్రేక్ పడనుందా...కరోనా నేపథ్యంలో సభలు ,సమావేశాలు నిర్వహించవద్ద వద్దంటూ...రాష్ట్ర ప్రభుత్వమే..విడుదల చేసిన జీఓ ను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందా..
ఇవే ప్రశ్నలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేరింది..మరోవైపు రేపటి లోగా..ఎన్నికల కమిషన్ స్పందించ కుంటే... కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తానంటున్నారు యుగతులసి, గోసేన ఫౌండేషన్ చైర్మన్ కే శివ కుమార్.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ స్పీడ్ ను పెంచింది...దీంతో ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నే పలు రాష్ట్రాలు, ప్రాంతాలు స్వయం ప్రకటిత లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కట్టడి పలు చర్యలు చేపట్టారు. ఓవైపు వ్యాక్సిన్ ఏర్పాట్లతోపాటు, ముందు జాగ్రత్త చర్యగా రోడ్లపై మాస్క్ లేని వారికి వేలాది రూపాయల ఫైన్ కూడా విధిస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 30 వరకు ఎలాంటి స సభలు ,సమావేశాలు నిర్వహించకూడదని జీవో కూడ జారీ చేశారు.
అయితే ఓవైపు కరోనా విస్తృతమవుతున్నా మరోవైపు ఎన్నికల కమీషన్ దేశంతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ లో ఈనెల 17 ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ పద్నాగవ తేదీన హలియాలో నిర్వహించబోయో బహిరంగ సభలో పాల్గోనున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలతో అలర్ట్ అయిన అధికార పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తిరిగి వాటిని పునారావృతం కాకుండా గులాబి బాస్ చుస్తున్నారు. దీంతో తానే స్యయంగా సభకు హజరవుతున్నారు. అయితే ప్రభుత్వమే సభలు సమావేశాలు నిర్వహించవద్దంటూ జీవో జారీ చేసి తిరిగి ప్రభుత్వమే ఉల్లింఘంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..శివకుమార్ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం. సభలు సమావేశాల వల్ల ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అందుకే ఈ సభను రద్దు చేయాలని ఆయన కోరారు. కాగా శివకుమార్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఏప్రిల్ 12న కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్టు ఆయన తెలిపారు.
కాగా కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బార్లు , ఇతర రెస్టారెంట్ ల అనుమతిపై కూడ ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని వ్యాఖ్యానించింది. మొత్తం ప్రభుత్వ చర్యలను ఈ నెల 19న కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వేలాది మంది పాల్గోనే సభపై లంచ్ మోషన్ స్వీకరిస్తుందా, లేదంటే ఎన్నికల కమీషన్ కు వదిలి వేస్తుందా అనేది వేచి చూడాలి. కాని రెండు రోజుల క్రితమే ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ రాష్ట్ర్ర ప్రభుత్వ అనుమతితోనే కొనసాగిన విషయం తెలిసిందే.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.