ఏపీలో జగన్ టీమ్‌లోకి కొత్త డిప్యూటీ సీఎం...?

సీఎం వైఎస్ జగన్

బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయడం ఖాయం.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లోకి కొత్త ఉప ముఖ్యమంత్రి రానున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు నామినేషన్ వేయడంతో ఆయన స్థానంలో మరో కొత్త డిప్యూటీ సీఎం రానున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో నేత మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రి. ఆయన కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. వారితోపాటు వ్యాపారవేత్తలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ కూడా వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ రాజ్యసభకు వెళ్లిపోతే వారి స్థానంలో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి వస్తాయనే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న వారితోనే జగన్ సరిపెడతారా? పిల్లి, మోపిదేవి నిర్వహిస్తున్న శాఖలను మిగిలిన మంత్రులకు పంచుతారా? లేకపోతే కొత్తగా ఇద్దరు మంత్రులను తీసుకుంటారా? వీటిలో ఏం జరిగినా కొత్తగా ఓ ఉప ముఖ్యమంత్రి రావడం ఖాయం.

  సీఎం జగన్ మోహన్ రెడ్డితో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ


  జగన్ కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయడం ఖాయం. అప్పుడు బీసీ సామాజికవర్గానికే చెందిన మరొకరికి కేబినెట్‌లో సీటు లభిస్తుంది. అలాగే, మోపిదేవి కూడా బీసీనే కాబట్టి, మరో బీసీ నేతకు కూడా జగన్ మంత్రివర్గంలో చోటు దక్కనుంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: