news18-telugu
Updated: May 10, 2019, 6:47 AM IST
ప్రతీకాత్మక చిత్రం
రాజకీయ లక్ష్యం.. అధికారాన్ని దక్కించుకోవడం. రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే మాటల నేర్పు, చేతల కూర్పు ఉండాలి.. ముఖ్యంగావెనక ఆస్తులు ఉండాలి. ఇప్పుడున్న కాలంలో కనీసం సర్పంచిగా నిలబడే అభ్యర్థికి కూడా కోట్లలో ఆస్తులు ఉంటున్నాయి. కానీ, ఓ ఎమ్మెల్యే అభ్యర్థి కేవలం రూ.9. ఆ పైసలతో ఒక పెన్ను కూడా సరిగా కొనలేం. ఆయన ఎమ్మెల్యే ఏం అవుతారులే.. అని అనుకుంటున్నారా. వివరాల్లోకెళితే.. రాజకీయ అవినీతి, వారసత్వ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని ఆధ్యాత్మికతకు కొత్త అర్థం చెబుతున్నారు ఓ యువ సన్యాసి. ‘ప్రజల నుంచి తీసుకున్న డబ్బును రాజకీయ నాయకులు వారి సొంత అభివృద్ధి కోసం వాడుకుంటున్నారు. అందుకే సామాజిక సేవ చేయడానికి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా’ అని ప్రకటించారు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన దీపక్ గంగారామ్ కటక్ధోండ్ అలియాస్ శ్రీవేంకటేశ్వర మహా స్వామీజీ.
గోవా సీఎం మనోహర్ పర్రీకర్ మరణంతో పనాజీ శాసనసభా స్థానానికి మే 19న జరగనున్న ఉప ఎన్నికలో వేంకటేశ్వర స్వామీజీ పోటీకి దిగుతున్నారు. పనాజీతో పాటు అదే రోజున ఉప ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలోని చింఛోలి నుంచి కూడా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన తన ఆస్తుల విలువ కేవలం 9 రూపాయలుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
May 10, 2019, 6:47 AM IST