ప్రగతిభవన్‌లో కేటీఆర్, జగన్.. ఓ సరదా సంఘటన

జగన్ మోహన్ రెడ్డిని హగ్ చేసుకోవడానికి కేటీఆర్ ముందుకు రాగా, జగన్ కొంచెం వెనక్కి జరిగారు. మరోసారి కూడా అలాగే జరిగింది. చివరకు జగన్‌ను కేటీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు.

news18-telugu
Updated: May 25, 2019, 9:51 PM IST
ప్రగతిభవన్‌లో కేటీఆర్, జగన్.. ఓ సరదా సంఘటన
కేటీఆర్, జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం తర్వాత తొలిసారి తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రగతిభవన్‌లో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు ఎదురొచ్చి జగన్ మోహన్ రెడ్డి, భారతిరెడ్డిని తోడ్కొని వెళ్లారు. గుమ్మంలోనే జగన్ మోహన్ రెడ్డిని హగ్ చేసుకున్న కేసీఆర్ అనంతరం ఇంట్లో స్వీట్లు తినిపించి ఖుషీ చేశారు. తమ ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చిన జగన్‌ను కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఓ సరదా ఘటన జరిగింది. కేసీఆర్‌‌కు హగ్ ఇవ్వడంతో సంకోచించని జగన్ మోహన్ రెడ్డి కేటీఆర్ విషయానికి వచ్చేసరికి కొంచెం తటపటాయించారు. జగన్ మోహన్ రెడ్డిని హగ్ చేసుకోవడానికి కేటీఆర్ ముందుకు రాగా, జగన్ కొంచెం వెనక్కి జరిగారు. మరోసారి కూడా అలాగే జరిగింది. చివరకు జగన్‌ను కేటీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. జగన్, భారతిరెడ్డి తిరిగి వెళ్లేటప్పుడు కేటీఆర్ భార్య శైలిమ.. బొట్టుపెట్టి పంపించారు.

First published: May 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>