ఆ రెస్టారెంట్‌లో ఆర్టికల్ 370 వెజ్ థాలీ... డిస్కౌంట్ ఎంతో తెలుసా?

ఆర్టికల్ 370 వెజ్ థాలీ అంటూ జమ్మూకశ్మీర్‌ వాసులకు ఓ ఆఫర్‌ ప్రకటించింది.

news18-telugu
Updated: September 7, 2019, 11:35 AM IST
ఆ రెస్టారెంట్‌లో ఆర్టికల్ 370 వెజ్ థాలీ... డిస్కౌంట్ ఎంతో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ మధ్య సోషల్ మీడియాను బేస్ చేసుకొని చాలా మంది బిజినెస్ చేసేస్తున్నారు. ఆ మధ్య బాలకోట్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి కొంతమంది సూరత్ డిజైనర్లు ఎయిర్ స్ట్రైక్స్ శారీస్ డిజైన్ చేశారు. చీరలపై యుద్ధవిమానాలు, సైనికులు, ప్రధాని మోదీకి సంబంధించిన చిత్రాల్ని ప్రింట్ చేశారు. అప్పట్లో ఈ చీరలు దేశవ్యాప్తంగా హట్ టాపిక్‌గా మారాయి. అది గతం... ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న పదం... ఆర్టికల్ 370. చాలామందికి దీనిపై పూర్తి అవగాహన లేకోపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్‌లో నడుస్తొంది. 370 ఆర్టికల్‌ రద్దు అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇదే విషయమై పాకిస్తాన్‌, భారత్‌ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇదే అదునుగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ ఆర్టికల్ 370పై ఓ ఫుడ్ మెనూ స్టార్ట్ చేసింది. కన్నాట్‌ ప్లేస్‌లోని ఆర్డోర్‌ 2.1 అనే రెస్టారెంట్‌.. ఆర్టికల్ 370 వెజ్ థాలీ అంటూ జమ్మూకశ్మీర్‌ వాసులకు ఓ ఆఫర్‌ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల రుచులందించే సూపర్‌ సైజ్‌ ఆర్టికల్‌ 370 థాలిపై 370 రూపాయల డిస్కౌంట్‌ కూడా ప్రకటించింది. అయితే ఇది కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ ఐడీ చూపిస్తే ప్రత్యేక తగ్గింపుతో ఆర్టికల్‌ 370 థాలిని అందిస్తోంది.

వెజ్‌ థాలి ధర రూ. 2,370 కాగా..నాన్‌ వెజ్‌ థాలి ధర రూ.2,669గా నిర్ణయించింది. వెజ్‌ మెనూల్‌ కశ్మీరీ పులావ్‌, ఖమీర్‌ కి రోటీ, నద్రు కీ షమీ, దమ్‌ ఆల్‌, కహ్వా ఉంటాయి. ఇక నాన్‌ వెజ్‌ మెనూలో కశ్మీరీ పులావ్‌, ఖమీర్‌ కి రోటీ, నద్రు కి షమీ, రోగన్‌ జోష్‌, కహ్వా ఉన్నాయి.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading